పీఎన్‌బీకి మొండిబకాయిల భారం | PNB Shares Sink After Q4 Net Slumps 62% on Bad Loans | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీకి మొండిబకాయిల భారం

Published Sat, May 9 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

పీఎన్‌బీకి మొండిబకాయిల భారం

పీఎన్‌బీకి మొండిబకాయిల భారం

62 శాతం తగ్గిన నికర లాభం
ఐదేళ్లలో కనిష్ట స్థాయికి
ఒక్కో షేర్‌కు రూ. 3.30 డివిడెండ్

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)  గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. నికర లాభం 62 శాతం క్షీణించింది. మొండిబకాయిలకు  అధిక కేటాయింపుల కారణంగా నికర లాభం భారీగా క్షీణించిందని బ్యాంక్  ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌరీ శంకర్ చెప్పారు. రూ. 2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.3.30 డివిడెండ్ (165%) ఇస్తామని పేర్కొన్నారు.

2013-14 క్యూ4లో రూ.806 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.307 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఐదేళ్లలో నికర లాభంలో ఇదే  కనిష్ట స్థాయని వివరించారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.12,498 కోట్ల నుంచి 8% వృద్ధితో రూ.13,456 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ ఆదాయం రూ.4,002 కోట్ల నుంచి 5% క్షీణించి రూ.3,792కు తగ్గిందని వివరించారు. మొండిబకాయిలకు కేటాయింపులు రూ.1,755 కోట్ల నుంచి 87% వృద్ధితో రూ.3,281 కోట్లకు పెంచామన్నారు. స్థూల మొండిబకాయిలు 5.25% నుంచి 6.55 శాతానికి,  నికర మొండి బకాయిలు 2.85 శాతం నుంచి 4.06 శాతానికి పెరిగాయని తెలిపారు. రూ.15,241 కోట్ల విలువై న రుణాలను పునర్వ్యవస్థీకరించామని చెప్పారు.
 
2014-15 పూర్తి ఏడాదికి నికర లాభం 8 శాతం క్షీణించి రూ.3.062 కోట్లకు తగ్గిందని గౌరీ శంకర్ తెలిపారు. 2013-14లో లాభం రూ.3,343 కోట్లు. మొత్తం ఆదాయం మాత్రం రూ.47,780 కోట్ల నుంచి 9% వృద్ధితో రూ.52,206 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
 
నిరుత్సాహక ఫలితాలతో ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ షేర్ 7% క్షీణించి రూ.146 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్టాన్ని(రూ.142) తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement