పీఎన్‌బీ ప్రాసెసింగ్ ఫీజు రాయితీ
న్యూఢిల్లీ: గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) డిసెంబర్ వరకూ మినహాయించనుంది. డాక్యుమెంటు చార్జీల విషయంలో కూడా ఈ రాయితీని వర్తింపజేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. జూన్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ మంజూరుచేసే రుణాలకు సంబంధించి ఈ ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది. భారత్‌లో విద్యకు సంబంధించి రుణాల విషయంలో ప్రాసెసింగ్ ఫీజును పీఎన్‌బీ ఇప్పటికే రద్దు చేసింది. బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్)ను ఇటీవలే 10.25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా బేస్ రేటుకే గృహ రుణాన్ని సైతం పీఎన్‌బీ ఆఫర్ చేస్తోంది.