
రూ. 12 వేల కోట్లతో60 వేల టెలికం టవర్లు
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు మరిన్ని అధికారాలు అప్పగించడంతోనే కాల్ డ్రాప్ సమస్యకు అంతిమ పరిష్కారం లభించదని టెలికం కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. టెల్కోలపై రూ.10 కోట్ల వరకు జరిమానా, వాటి ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధింపు వంటి తదితర అంశాలకు సంబంధించి అధికారాలను అప్పగించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దీపక్ దీనిపై స్పందిస్తూ.. అధికారాల అప్పగింతే సమస్యకు అంతిమ పరిష్కారం కాదని చెప్పారు. మొబైల్ ఆపరేటర్స్ 60,000 టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఒక్కో టవర్‌కు రూ.20 లక్షల చొప్పున మొత్తం టవర్ల ఏర్పాటుకు రూ.12,000 కోట్లు అవుతుందని పేర్కొన్నారు.