Call Drop
-
‘సిగ్నల్’ చోరీ
సాక్షి, అమరావతి: దేశంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య పెరుగుతోంది. ఫోన్ చేస్తే మధ్యలోనే కాల్ డ్రాప్ అవుతోంది. ఒక్కోసారి సిగ్నల్ ఉన్నట్టే ఉంటుంది.. కానీ ఫోన్ మాత్రం కలవదు. ఇవన్నీ తమ వల్ల వచ్చిన సమస్యలు కావని.. సెల్ టవర్లపై దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో తలెత్తిన సమస్యలని నెట్వర్క్ ఇంజనీర్లు, టెలికాం సంస్థలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో దేశవ్యాప్తంగా 17 వేల రేడియో రిమోట్ యూనిట్లు(ఆర్ఆర్యూ) చోరీకి గురయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో ట్రాన్స్ రిసీవర్‌గా ఆర్ఆర్యూ ఉపయోగపడుతుంది. ఇది ట్రాన్స్మిషన్ పనితీరును, మొబైల్ సిగ్నల్ల స్వీకరణను మిళితం చేస్తుంది. ఆర్‌ఆర్‌యూలు చోరీకి గురవుతుండటంతో సిగ్నల్ సమస్యలు పెరిగిపోతున్నాయని టెలికాం నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలతో దేశవ్యాప్తంగా టెలికాం కంపెనీలు రూ.800 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దొంగిలించిన ఆర్ఆర్ యూనిట్లును చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్యులార్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ).. ఆర్ఆర్యూ దొంగతనాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశ డిజిటల్ భవిష్యత్‌కు ఉపయోగపడే కీలక మౌలిక సదుపాయాలను రక్షించడానికి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతోంది.ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ తరహా దొంగతనాలు పెరిగాయి. గుజరాత్‌తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. -
ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్, కాల్స్ నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టెలికం శాఖ (డాట్) ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాల్స్ నాణ్యతను మెరుగుపర్చేందుకు, కాల్ డ్రాప్స్‌ను కట్టడి చేసేందుకు సేవల నాణ్యత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో సేవల నాణ్యత (క్యూఓఎస్) చాలా ముఖ్యమని డాట్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యూఓఎస్ విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలను పరిశీలించిన మీద ట ట్రాయ్ కొన్ని కీలక అంశాలను ట్రాయ్‌కు సిఫార్సు చేసిందని పేర్కొన్నాయి. కాల్ డ్రాప్, కాల్స్ నాణ్యత అంశాలపై ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించిన మీదట డాట్ ఈ మేరకు సూచనలు చేసింది. మరోవైపు, సర్వీసుల నాణ్యత, నిబంధనల సమీక్ష, 5జీ సేవల ప్రమాణాలు, అవాంఛిత వాణిజ్య సందేశాలు మొదలైన వాటికి సంబంధించి తీసుకోతగిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఫిబ్రవరి 17న టెల్కోలతో ట్రాయ్ సమావేశం కానుంది. అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను టెల్కోలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సేవలతో కాల్ నాణ్యత మెరుగుపడుతుందని ఆశించినప్పటికీ.. పరిస్థితి మరింతగా దిగజారిందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లోకల్‌సర్కిల్స్ సంస్థ జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం కాల్ నాణ్యత అస్సలు మెరుగుపడలేదని 42 శాతం మంది, మరింతగా దిగజారిందని 19 శాతం మంది 5జీ యూజర్లు వెల్లడించారు. ఓటీటీల నియంత్రణకు టెల్కోల పట్టు.. కమ్యూనికేషన్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థల నియంత్రణకు గట్టి నిబంధనలు రూపొందించాలని ట్రాయ్‌ని టెల్కోలు మరోసారి కోరాయి. ఒకే రకం సేవలు అందించే సంస్థలకు ఒకే రకం నిబంధనలు ఉండాలని పేర్కొన్నాయి. తమలాంటి సేవలే అందిస్తున్న ఓటీటీలకు కూడా తమకు అమలు చేసే నిబంధనలను వర్తింపచేయాలని స్పష్టం చేశాయి. 2023 అజెండాపై కసరత్తుకు సంబంధించి ట్రాయ్‌తో బుధవారం జరిగిన భేటీలో టెల్కోలు ఈ మేరకు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా, ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్, వొడాఫోన్ ఐడియా కార్పొరేట్ వ్యవహారాల అధికారి పి. బాలాజీ ఈ భేటీలో పాల్గొన్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..) -
కాల్‌డ్రాప్ పరిస్థితిపై చర్చిద్దాం రండి!
న్యూఢిల్లీ : వినియోగదారులకు తెగ విసుగు తెప్పించిన కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి మనోజ్ సిన్హా, టెల్కోలతో భేటీ కానున్నారు. నవంబర్ 1న అన్ని టెలికాం కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఆయన భేటీ నిర్వహించనున్నట్టు టెలికాం సెక్రటరీ జే.ఎస్ దీపక్ తెలిపారు. ఈ భేటీలోనే కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితితో పాటు, భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించనున్నారు. కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు దీపక్ తెలిపారు. ఈ సమస్యపై జూన్‌లో టెలికాం కంపెనీ ఆపరేటర్లతో భేటీ నిర్వహించామని, ఆ భేటీలో టెల్కోలు 100 రోజుల ప్లాన్ హామీగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా కాల్ డ్రాప్స్ పరిస్థితి చక్కబరిచి, లక్ష్యాలను చేధిస్తామన్నారని వాగ్దానం చేసినట్టు చెప్పారు. జూన్10 నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19కి తగ్గినట్టు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా టెల్కోలు 60వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను) ఏర్పరచనున్నట్టు తెలిపారు. మొదటి 45లో 48వేల స్టేషన్లను టెల్కోలు ఏర్పరిచారు. కాల్ డ్రాప్స్ సమస్య నుంచి బయటపడటానికి బీటీఎస్‌లు ఏర్పాటుకు టెల్కోలు రూ.12వేల కోట్ల మేర ఖర్చుచేస్తున్నట్టు దీపక్ తెలిపారు. -
రూ. 12 వేల కోట్లతో60 వేల టెలికం టవర్లు
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు మరిన్ని అధికారాలు అప్పగించడంతోనే కాల్ డ్రాప్ సమస్యకు అంతిమ పరిష్కారం లభించదని టెలికం కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. టెల్కోలపై రూ.10 కోట్ల వరకు జరిమానా, వాటి ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధింపు వంటి తదితర అంశాలకు సంబంధించి అధికారాలను అప్పగించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దీపక్ దీనిపై స్పందిస్తూ.. అధికారాల అప్పగింతే సమస్యకు అంతిమ పరిష్కారం కాదని చెప్పారు. మొబైల్ ఆపరేటర్స్ 60,000 టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఒక్కో టవర్‌కు రూ.20 లక్షల చొప్పున మొత్తం టవర్ల ఏర్పాటుకు రూ.12,000 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. -
కాల్ డ్రాప్ నిబంధనలను పాటించండి
టెల్కోలకు ట్రాయ్ లేఖలు * కోర్టు ఆదేశాలు వస్తేనే పరిహారం చెల్లిస్తామంటున్న టెల్కోలు న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కాల్‌డ్రాప్ విషయంలో మరోసారి కొరడా ఝుళిపించింది. కాల్‌డ్రాప్ నిబంధనలను ఈ నెల 1 నుంచి అమలు చేయాలని మొబైల్ ఆపరేటర్లకు రాసిన లేఖల్లో ఆదేశించింది. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే తాము వినియోగదారులకు నష్టపరిహారం చెల్లిస్తామంటూ టెలికం సంస్థలు పేర్కొన్నప్పటికీ, ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాల్‌డ్రాప్‌కు రూ.1 పరిహారం... వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పలు మొబైల్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నదని, కోర్టు ఆదేశాలిస్తే పరిహారం చెల్లిస్తామని అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అశోక్ సూద్ తెలిపారు. -
కాల్ డ్రాప్‌లపై టెల్కోలకు జనవరి 6 దాకా ఊరట
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్‌కి పరిహారం విషయంలో టెల్కోలకు కొంత ఊరట లభించింది. తదుపరి విచారణ తేది జనవరి 6 దాకా ఈ అంశానికి సంబంధించి ఆపరేటర్లను ఒత్తిడి చేసే చర్యలు తీసుకోబోమని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనలు మాత్రం ముందుగా నిర్ణయించినట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నెట్వర్క్ సమస్యల వల్ల కాల్ డ్రాప్ అయిన పక్షంలో యూజర్లకు రూ. 1 పరిహారంగా చెల్లించాలన్న ట్రాయ్ నిబంధనలను సవాలు చేస్తూ టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్‌కామ్ తదితర 21 టెల్కోలు ఇందులో ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం నూటికి నూరుపాళ్లు కాల్ డ్రాప్ సమస్య ఉండని నెట్వర్క్ ఏర్పాటు అసాధ్యమని తెలిసీ ట్రాయ్ పరిహారం నిర్ణయం తీసుకుందని ఆపరేటర్ల తరఫు లాయర్ హరీశ్ సాల్వే పేర్కొన్నారు. అయితే, సంబంధిత వర్గాలన్నింటి అభిప్రాయాలు తీసుకున్న మేరకే అక్టోబర్ 16న నిబంధనలను ప్రకటించడం జరిగిందని, టెల్కోల స్థూల ఆదాయంలో పరిహార భారం కేవలం ఒక్క శాతం కన్నా తక్కువే ఉండొచ్చని జస్టిస్ రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన బెంచ్‌కి అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. వాదోపవాదాలు విన్న మీదట కేసు తదుపరి విచారణను బెంచ్ జనవరి 6 దాకా వాయిదా వేసింది. -
ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి పరిహారం
ముంబై: సెల్ ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 'కాల్ డ్రాప్స్'కు పరిహారం చెల్లించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున చెల్లించాలని.. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రోజులో మూడుసార్లు మాత్రమే ఈ పరిహారం అందుతుందని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయితే నాలుగు గంటల్లోగా పరిహారం అందించాలని సూచించింది. పరిహారం అందించిన విషయాన్ని వినియోగదారుడి ఎస్ఎంఎస్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా వినియోగదారులకు తెలపాలని ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తర్వాత నెల బిల్లులో వివరాలు పేర్కొనాలని సలహాయిచ్చింది. తాము వెలువరించిన ఆదేశాలను టెలికం ఆపరేటర్లు ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటామని తెలిపింది. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం అయ్యేందుకు సర్వీసు ప్రొవైడర్లు ప్రయత్నించాలని సూచించింది. దీనిపై ఆరునెలల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని ట్రాయ్ తెలిపింది. -
కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం ఇవ్వాల్సిందే
- ట్రాయ్‌కి మొబైల్ యూజర్ల వినతి - పరిహార ప్రతిపాదనను వ్యతిరేకించిన టెలికం కంపెనీలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ అయితే టెల్కోలు పరిహారం చెల్లించే అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన చర్చాపత్రంపై ఇటు మొబైల్ యూజర్లు, అటు పరిశ్రమ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాల్ డ్రాప్ అయిన పక్షంలో టెలికం కంపెనీలు రెట్టింపు పరిహారం చెల్లించాలని మొబైల్ యూజర్లు డిమాండ్ చేశారు. టెల్కోల నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల పలు సందర్భాల్లో కాల్స్‌కి అంతరాయం కలుగుతోందని, ఇలాంటప్పుడు సదరు కాల్స్‌కి కూడా డబ్బు వసూలు చేయడమనేది వేధింపు కిందికి వస్తుందంటూ కొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. కాల్ డ్రాప్‌తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా సరిగ్గా ఉండటం లేదంటూ వందల కొద్దీ ఫిర్యాదులు ట్రాయ్‌కి అందాయి. యూజరు నష్టపోయిన దానికి పరిహారంగా ఆ మేర వ్యవధికి సరిపడేలా ఉచిత టాక్‌టైమ్ ఇచ్చేలా చూడాలని, యూనినార్.. రిలయన్స్ వంటివి ఇటువంటి విధానం అమలు చేస్తున్నాయని మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ పేర్కొన్నారు. మరోవైపు, అయిదు సెకన్ల లోగా గానీ ఆ తర్వాత గానీ కాల్ డ్రాప్ అయితే.. చార్జీని మొత్తానికే వసూలు చేయకూడదన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ), అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ (ఏయూఎస్‌పీఐ) ట్రాయ్‌కి తెలిపాయి. ఎటువంటి అంతరాయం లేకుండా కాల్ కొనసాగినంత వ్యవధికి చార్జీలు ఉండాల్సిందేనని పేర్కొన్నాయి. ఇక కాల్ డ్రాప్ వ్యవహారంలో పరిహారం చెల్లించడం వల్ల సమస్య పరిష్కారం కాదని సీవోఏఐ పేర్కొంది. స్పెక్ట్రం కొరత, నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు సైట్ల కొరత సమస్యలు అలాగే ఉంటాయని వివరించింది.