చంద్రశేఖరన్‌ సామర్థ్యానికి తగిన గుర్తింపు: రతన్‌ టాటా | Ratan Tata congratulates new Tata Sons chairman N Chandrasekaran, says he'll take the group to new heights | Sakshi
Sakshi News home page

చంద్రశేఖరన్‌ సామర్థ్యానికి తగిన గుర్తింపు: రతన్‌ టాటా

Published Sat, Jan 14 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

చంద్రశేఖరన్‌ సామర్థ్యానికి తగిన గుర్తింపు: రతన్‌ టాటా

చంద్రశేఖరన్‌ సామర్థ్యానికి తగిన గుర్తింపు: రతన్‌ టాటా

ముంబై: టాటా గ్రూపును నూతన ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఎంపికైన ఎన్‌.చంద్రశేఖరన్‌ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళతారం టూ తాత్కాలిక చైర్మన్‌ రతన్‌టాటా ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్‌ నియామకం జరిగిన మరుసటి రోజు రతన్‌ టాటా స్పందించారు. టాటా సన్స్, టాటా గ్రూపు చైర్మన్‌గా నియమితులైన చంద్రకు తన అభినందనలు తెలియజేశారు. చంద్రశేఖరన్‌ నాయకత్వ సామర్థ్యాలకు ఇది తగిన గుర్తింపుగా రతన్‌ టాటా పేర్కొన్నారు.

కొత్త ఉద్యోగం సంక్లిష్టమైనది అయినప్పటికీ అతను టాటా గ్రూపు విలువలను అన్ని వేళలా పరిరక్షిస్తూనే కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలడంటూ చంద్ర పట్ల తన నమ్మకాన్ని వ్యక్తీకరించారు. టీసీఎస్‌ ఎండీ, సీఈవోగా ఉన్న ఎన్‌.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement