రతన్ టాటాకు కెనడా వర్సిటీ గౌరవ డాక్టరేట్!
టొరొంటో: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రతన్ టాటాకు కెనడాలోని ప్రఖ్యాత యార్క్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది.
సామాజిక బాధ్యతగా కార్పోరేట్ వ్యాపారాన్ని ప్రమోట్ చేసినందుకుగాను గౌరవ డాక్టరేట్ ను యార్క్ వర్సిటీ అందించ్చింది. గౌరవ డాక్టరేట్ ను అందుకునేందుకు రతన్ టాటా టొరొంటోకు వెళ్లారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రతన్ ఈ అవార్డును అందుకున్నారు.
పోటీ ప్రపంచంలోకి మీరు వెళ్లగలిగితే.. వ్యాపార రంగం కాని.. ప్రపంచంలోని ఇతర రంగాల్లో లీడర్లుగా ఎదుగుతారు. లక్షలాది మందికి మీకంటే తక్కువ అవకాశాలున్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు సాధించే విజయాలు.. మీ జీవితంలో చాలా మార్పులు తెస్తాయి అని రతన్ టాటా తన ప్రసంగంలో పేర్కొన్నారు.