మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన | Ratan Tata takes on fake news again says didnt write quote  | Sakshi
Sakshi News home page

మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన

Published Mon, May 4 2020 2:14 PM | Last Updated on Mon, May 4 2020 2:19 PM

Ratan Tata takes on fake news again says didnt write quote  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరోసారి  ఫేక్ న్యూస్ బారిన పడ్డారు.  దీంతో ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాదు  తాను చెప్పని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబధిత నకిలీ వార్తా కథనాన్ని షేర్ చేసిన రతన్ టాటా..ఇది కూడా నన్ను భయపెడుతోంది. ఇది నేను చెప్పలేదంటూ ట్వీట్ చేశారు.  తన ఫోటో ఉన్నంత మాత్రాన  ఆ వ్యాఖ్యలు తాను చేసినట్టు కాదని  ఆయన పేర్కొన్నారు.  ఇలాంటి నకిలీ వార్తలపై తనకు వీలైన  సమయాల్లో స్పందిస్తానని చెప్పారు. కానీ వీటిపట్ల అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి వాటిని నిర్ధారించుకోవాలంటూ  రతన్ టాటా  మరోసారి సూచించారు.

రతన్ టాటా ఆదివారం సాయంత్రం  వివరణ  ఇచ్చిన ఈ ట్వీట్  వైరల్ అయింది. లక్షకు పైగా లైక్‌లు, వేలాది రీట్వీట్‌లను  సాధించింది.  కాగా  గత నెలలో కరోనావైరస్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గురించి రతన్ టాటా అభిప్రాయం పేరుతో ఒక నకలీ వార్త బాగా వైరల్ అయింది. దీంతో స్వయంగా రతన్  టాటా ఆ అభిప్రాయం తనది కాదని, తాను అసలు అలా చెప్పలేదంటూ  ట్విటర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement