
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ మంగళవారం సెంట్రల్ బ్యాంక్ అంతర్గత మధ్యకాలిక వ్యూహాత్మక విధానం (ఫ్రేమ్‌వర్క్) ‘ఉత్కర్ష్ 2022’ను ఆవిష్కరించారు. ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి తన అత్యుత్తమ నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ, ద్రవ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించడం వంటి లక్ష్యాలతో మూడేళ్ల కాలపరిమితికిగాను ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం జరిగింది. ఫ్రేమ్‌వర్క్ అమలు అంశాలను సెంట్రల్ బోర్డ్ సబ్ కమిటీ ద్వారా కాలానుగుణంగా పర్యవేక్షించడం జరుగుతుంది. నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగం పటిష్టతకు అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ఈ తరహా ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించి, అమలు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.