Shaktikanth das
-
ఎకానమీ పురోగతే ఆర్బీఐ చర్యల లక్ష్యం
ముంబై: రేట్ల పెంపు ద్వారా కఠిన విధానంవైపు మొగ్గుచూపి, వృద్ధి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెనుకడుగు వేసిందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి తీసుకునే చర్యలు ఎకానమీ పురోగతికి ప్రతికూలం అని భావించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఎకానమీ పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి సమతౌల్యతకు ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు, ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా మే, జూన్ నెలల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా 0.4 శాతం, 0.5 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. అయితే దీనిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ఒక వ్యాసంలో ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్బీఐ ఆలస్యంగా వ్యవహరించిందని, చివరకు పాలసీలో మార్పుచేసి వృద్ధి విషయంలో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్బీఐపై వస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావించారు. మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాం... అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించిందని అన్నారు. విధానం మార్పునకు తగిన కాల వ్యవధిని అనుసరించిందని స్పష్టం చేశారు. ‘‘మహమ్మారి సమయంలో అధిక ద్రవ్యోల్బణాన్ని సహించడం చాలా అవసరం. అప్పటి క్లిష్ట సమయంలో రేట్ల పెంపు ఎంతమాత్రం సమంజసం కాదు. ఆ విధానం పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా ఉంటాయి. మేము ఇప్పటికీ మేము అప్పటి మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము’’ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, లోన్ రికవరీ ఏజెంట్ల విపరీత చర్యలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భగా హెచ్చరించారు. ఫైనాన్షియల్ రంగంలోకి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ (మెటా) వంటి బడా సంస్థల ప్రవేశం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయని కూడా కార్యక్రమంలో గవర్నర్ పేర్కొన్నారు. -
ఇక వడ్డీరేట్లు పైపైకి!
ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది. మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు 4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి. ద్రవ్యోల్బణంపై అందోళన... అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. ఏకగ్రీవ నిర్ణయం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని ‘‘రిమైనింగ్ అకామిడేటివ్’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్ ఆఫ్ అకామిడేటివ్’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది. వృద్ధి బాట పటిష్టం కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది. ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇంతక్రితమే వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే. రిజిస్టర్‌కాని డిజిటల్ లెండింగ్ యాప్‌లపై హెచ్చరిక కాగా, డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్ యాప్‌లపైనే ఆర్బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిట్ కార్డులకు ‘యూపీఐ’ లింక్ క్రెడిట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం. అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా మర్చంట్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్ చార్జ్ ఉంటుంది. తాజా ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్ జరిగినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మ్యాండేట్ పరిమితి రూ.15,000కు పెంపు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్ (కస్టమర్ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్ అవసరం లేదన్నమాట. రియల్టీ మందగమనమే ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్ జోన్లోకి నెట్టేసింది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ సహకార బ్యాంక్ గృహ రుణ పరిమితి రెట్టింపు రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది. డెవలపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్బీఐ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ (సీఆర్ఈ–ఆర్‌హెచ్) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల నిర్వహణకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలపడం మరో విశేషం. సమగ్ర అంచనాలు... ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ కీలక దశ... ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ సమతుల్య పాలసీ... ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది. – అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి. -
అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు
ముంబై: అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలకు అనుగుణంగా ఎప్పుటికప్పుడు సకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలు ఉండాలని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 6 నుంచి 8 వరకూ జరిగిన సమావేశాల మినిట్స్ ఈ విషయాన్ని తెలిపింది. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లో నిర్ణయాలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా సకాలంలో తీసుకోవాలన్న గవర్నర్ అభిప్రాయానికి ఐదుగురు సభ్యులు మద్దతు పలికినట్లు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు: పాత్ర కాగా, డి–గ్లోబలైజేషన్ ఆసన్నమైనట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణమే ప్రధాన సవాలు ఉండే అవకాశం ఉందని, ఈ సవాలును జాగ్రత్తగా ఎదుర్కొనాలని ఎంపీసీ సభ్యుడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘‘1980 నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం 60 శాతం అభివృద్ధి చెందిన దేశాలు 5 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదల సామాజిక సహన స్థాయిలను పరీక్షిస్తోంది’’ అని సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు మినిట్స్ తెలిపాయి. మినిట్స్ ప్రకారం సమావేశంలో ముఖ్య అంశాలు, నిర్ణయాలు ► భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ► ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గింపు. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి డౌన్. ► పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంఉ. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి అప్. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని అంచనా. ► ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయం. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాలోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనా. ► అన్ని బ్యాంకుల కస్టమర్లకూ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు వెసులుబాటు ► అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి కొత్తగా ‘ఎస్డీఎఫ్’ ఇన్స్ట్రమెంట్. వడ్డీ రేట్ల పెంపు ఖాయం: కేకీ మిస్త్రీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇతర సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే రిజర్వ్ బ్యాంకు వెనుకబడి లేదని హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది క్రమంగా రెండు లేదా మూడు దఫాలుగా పెం చేందుకు అవకాశం ఉందని .. కానీ ఎకానమీపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల తొలినాళ్లలో పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ.. రెపో రేటును యధాతథంగా 4 శాతం స్థాయిలోనే కొనసాగించిన సంగ తి తెలిసిందే. ఇటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ అటు వృద్ధికి కూడా ఊతమిచ్చేలా రేట్ల పెంపుపై ఉదారవాద ధోరణిని కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావించింది. ఈ నేపథ్యంలోనే మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణంతో భారత్‌లో ధరల పెరుగుదలను పోల్చి చూడరాదని ఆయన చెప్పారు. చరిత్ర చూస్తే అమెరికాలో ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం అత్యంత కనిష్ట స్థాయుల్లో నమోదు అవుతుండగా .. భారత్‌లో భారీగా ఉంటోందని, రెండింటికి మధ్య 400 బేసిస్ పాయింట్ల మేర వ్యత్యాసం ఉంటోందని మిస్త్రీ తెలిపారు. అలాంటిది.. ప్రస్తుతం అమెరికాలో ఏకంగా 8.5 శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం ఎగియగా.. భారత్‌లో 5.7 శాతం ద్రవ్యోల్బణం కావచ్చన్న అంచనాలు నెలకొన్నట్లు ఆయన చెప్పారు. ‘ఆ రకంగా చూస్తే అమెరికాతో పోల్చినప్పుడు మన దగ్గర ద్రవ్యోల్బణం 2.8 శాతం తక్కువగా ఉంది. ఇంత భారీ ద్రవ్యోల్బణం ఎన్నడూ చూడలేని అమెరికా .. వడ్డీ రేట్ల పెంపు వంటి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది‘ అని మిస్త్రీ పేర్కొన్నారు. అమెరికాను చూసి భారత్ కూడా అదే ధోరణిలో వెళ్లాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. -
ఆ పుష్ఫం ముందు క్రిప్టో కరెన్సీ దిగదుడుపే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది. 2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు. సరళతరానికి ఐదుగురు ఓటు కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేగవంతమైన వృద్ధి ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం. మరికొన్ని కీలక నిర్ణయాలు... ► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది. ► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లెండింగ్పై మార్గదర్శకాలు డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు. క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు. డిజిటల్ కరెన్సీపై తొందరలేదు.. ఆర్బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు. లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు... ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు. అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ ఎకానమీకి భరోసా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ అంచనాలకు అనుగుణంగా... పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం. – అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్ డిమాండ్‌కు దోహదం సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షణీయం సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది. – హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
ఆర్బీఐ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ద్రవ్య పాలసీపై ఆర్బీఐ నిర్ణయాలతో పాటు ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కదలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ సూచీల ఐదువారాల వరుస లాభాలకు గతవారం బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల పతనంతో ఆ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,283 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్లను కోల్పోయాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, మెటల్, ఆటో షేర్లలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ‘‘ఈ వారంలోనూ మార్కెట్ స్థిరీకరణ జరగవచ్చు. అమెరికా స్టాక్ మార్కెట్ సెపె్టంబర్ దిద్దుబాటు ప్రభావం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్రూడాయిల్, కమోడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం భయాలు తెరపైకి వచ్చాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు యోచనలు చేస్తున్నాయి. ఫెడ్ ట్యాపరింగ్, చైనాలో తాజాగా నెలకొన్న సంక్షోభాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అయితే దేశీయ కార్పొరేట్ల రెండో ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండొచ్చనే విశ్లేషకుల అంచనాలు కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జూలియస్ బేయర్ ఇండియా ఎండీ ఉన్మేష్ కులకర్ణి తెలిపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే... అందరి చూపు ఆర్బీఐ వైపు ... భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం బుధవారం(అక్టోబర్ 6న) ప్రారంభమవుతుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే క్రూడాయిల్ ధరలు పెరుగుదల, కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రావడం, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. 8న టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల బోణీ... కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెపె్టంబర్) ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే వారం 13న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే రోజున (అక్టోబర్ 13న) వెలువడతాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం... దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరుకు ఆరు మాసాల్లో తొలి రెండు మినహా మిగతా నాలుగు నెలల్లో సేవారంగం మెరుగైన పనితీరు కనబరించింది. ఈ వారాంతాన శుక్రవారం ఆర్బీఐ సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలతో పాటు అక్టోబర్ 1వ వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు. రెండో నెలలోనూ కొనుగోళ్లు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్ మాసంలో రూ.26,517 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,154 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,363 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనాలో అనిశి్చతుల ప్రభావంతో ఎఫ్ఐఐలు ఇటీవల భారత్‌తో పాటు ఇతర వర్థమాన దేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ‘‘కోవిడ్ తర్వాత దీర్ఘకాలపు ప్రయోజనాల దృష్ట్యా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదైతే ఎఫ్ఐఐలు తిరిగి దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా డెరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
పాత నోట్లు, కాయిన్స్‌పై ఆర్బీఐ హెచ్చరిక...!
గత కొన్ని రోజుల నుంచి పాత కరెన్సీ నోట్లకు, పాత కాయిన్స్‌ను ఆన్లైన్లో సేల్కు పెట్టి భారీ నగదును పొందవచ్చుననే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆన్లైన్ కొనుగోళ్లు, అమ్మకాలుకు సంబంధించి ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పాత కరెన్సీ నోట్లు, కాయిన్స్‌కు సంబంధించి బుధవారం (ఆగస్టు 4) రోజున హెచ్చరికలను జారీ చేసింది. పాత కరెన్సీ నోట్లను, నాణేలను కమీషన్‌తో క్రయవిక్రయాలను అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను, నాణేలను క్రయవిక్రయాలను జరిపే సమయంలో కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు ఆర్బీఐ పేరు, లోగోలను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ఇతర మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి కమీషన్లు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పాతనోట్లను , కాయిన్స్‌ను మార్చే సమయంలో ఏలాంటి ఛార్జీలు, కమిషన్లను ఆర్బీఐ స్వీకరించదని పేర్కొంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం రోజున ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. శుక్రవారం (ఆగస్టు 6) రోజున ఈ కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనుంది. -
ఆర్బీఐ బూస్ట్: మార్కెట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో తోడు ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడు తారన్న అంచనా మధ్య లాభాలతో ట్రేడింగ్‌ను ఆరభించాయి. భారీ ఉపశమన ప్యాకేజీ లభించనుందన్న ఆశలు ఇన్వెస్టర్లనను ఊరించాయి. కానీ అలాంటి చర్యలేవీ శక్తికాంత దాస్ ప్రకటించలేదు. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఫార్మాకు ఊరట లభించడంతో ఫార్మ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇంకా బ్యాంకింగ్, ఆయిల్ , ఐటీ రంగ లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. చివరకు సెన్సెక్స్ 424 పాయింట్లు ఎగిసి48677 వద్ద, నిఫ్టీ 121పాయింట్ల లాభంతో 14617 వద్ద ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ 48600 ఎగువన, నిఫ్టీ 14600 ఎగువన ముగియడం విశేషం లుపిన్ 14 శాతం, 6 శాతం పుంజుకుని సన్ ఫార్మా టాప్ గెయినర్స్‌గా ఉండగా, ఇంకా అరబిందో, క్యాడిల్లా, యుపిఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో, భారతి ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, ఒఎన్‌జిసి, దివిస్ ల్యాబ్స్, టిసిఎస్, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా లాభపడ్డాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎస్బిఐ లైఫ్ ఎల్ అండ్‌డీ , ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. చదవండి : 2022 సెకండ్ ఆఫ్‌కి అందరికీ టీకాలు: ఆర్బీఐ గవర్నర్ -
గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం
-
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
కరోనా ప్రభావం లేకుండా చూడడమే లక్ష్యం
-
రివర్స్ రెపో రేటు పావు శాతం కోత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను ఆయన ప్రకటించారు. అంతేకాదు ప్రతీ అంశాన్ని, పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నా మని, సంబంధిత చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే చివరి సమావేశం కాదని, ఈ ప్రక్రియ ఇకముందు కూడా కొనసాగుతుందని, కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశిలీస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అధిగమించేందుకు ఆర్బీఐ అండగా వుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా ప్రభావం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామనీ ఆర్థిక వ్యవస్థను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా 24 గంటలూ శ్రమిస్తూ విశేష సేవలందించిన ఆర్బీఐ ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల సేవలు కూడా ప్రశంసనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగలేదు. ఏటీఎంలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 1930 తరువాత ఇంతటి సంక్షోభాన్ని చూడలేదనీ, అయినా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. (ఆర్బీఐ బూస్ట్, మార్కెట్లు జంప్) నాబార్డు , సిడ్బీ, ఎన్‌హెచ్‌బి వంటి ఆర్థిక సంస్థలకు రూ. 50 వేలకోట్ల ఆర్థిక సదుపాయాన్ని గవర్నర్ ప్రకటించారు. రివర్స్ రెపో రేటు 4 శాతం నుంచి పావుశాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రస్తుత 3.75 శాతంగా వుంటుంది. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నారు. లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సిఆర్) వాణిజ్య బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సిఆర్)ను ప్రస్తుతమున్న 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించనున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇది రెండు దశల్లో పునరుద్ధరించ బడుతుందన్నారు. 2020 అక్టోబర్ 1 నాటికి 90 శాతం, ఏప్రిల్ 1, 2021 నాటికి 100 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా కోవిడ్ -19 సంక్షోభం కారణంగా గత నెలలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ముందస్తు సమీక్షను చేపట్టిన ఆర్బీఐ కీలక వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఈ రోజు రూ. 20వేల కోట్ల బాండ్లను విక్రయించనుంది. -
మారని రేట్లు.. వృద్ధికి చర్యలు
ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ముందుకు వచ్చింది. అయితే, తన సర్దుబాటు విధానాన్ని మార్చుకోకపోవటం ద్వారా అవసరమైతే మున్ముందు రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ సంకేతమిచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రుణాలకు మంచి రోజులు ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ), ఆటోమొబైల్, గృహ రుణ వితరణ పెంపునకు వీలుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీంతో ఈ రంగాలకు అదనంగా ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు 4 శాతాన్ని సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది జూలై వరకు అమల్లో ఉంటుంది. ఇది బ్యాంకులకు సానుకూలం. ఎందుకంటే ఇలా మిగిలిన నిధులను రుణాలివ్వటానికి వినియోగించవచ్చు. ► దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈ రంగానికి మద్దతుగా.. డిఫాల్టయిన రుణాలను 2021 మార్చి 31 వరకు పునరుద్ధరిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ నమోదిత ఎంఎస్ఎంఈలకే ఇది వర్తిస్తుంది. జీడీపీలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 28%. ఎగుమతుల్లో వాటా 40 శాతం. అంతేకాదు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కూడా. ► వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఉపశమనం కల్పించింది. ప్రమోటర్ల చేతుల్లో లేని అంశాలతో వాణిజ్య రియల్టీ ప్రాజెక్టుల కార్యకలాపాల ఆరంభం ఆలస్యమైతే, వాటి రుణ గడువును ఏడాది పాటు పొడిగించేందుకు అనుమతించింది. అంటే ప్రాజెక్టులు ఆలస్యమైనా ఆయా రుణాలను డౌన్‌గ్రేడ్ చేయరు. ఇన్ఫ్రాయేతర రంగాల రుణాల్లాగే వీటినీ పరిగణిస్తారు. రియల్టీ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఇది అదనపు మద్దతునిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాలు రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి–మార్చి క్వార్టర్లో 6.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయిలో 7.35 శాతంగా నమోదు కావటం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం 3.8–4 శాతం మధ్య ఉంటుందని గతంలో చేసిన అంచనాలను సవరిస్తూ 5–5.4%కి పెంచింది. ప్రధానంగా కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగొచ్చని అభిప్రాయపడింది. వృద్ధి రేటు 5%: 2019–20లో వృద్ధి రేటు 5%గా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2020–21లో 6%గా ఉంటుందని అంచనా వేసింది. 2020–21 తొలి ఆరు నెలల్లో 5.9–6.3% మధ్య ఉంటుందన్న లోగడ అంచనాలను.. 5.5–6%కి తగ్గించింది. ఇతర ముఖ్యాంశాలు ► రేట్ల యథాతథ స్థితికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ► దీంతో ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి. ► ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్బీఐ పేర్కొంది. ► చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి ఆరంభమయ్యే) వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించే అవకాశాలున్నాయి. ► హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) నియంత్రణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తారు. అప్పటి వరకు నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఆదేశాలు, మార్గదర్శకాలే కొనసాగుతాయి. హెచ్ఎఫ్సీల నియంత్రణ గతేడాది ఆగస్ట్ 9 నుంచి ఆర్బీఐకి బదిలీ కావటం తెలిసిందే. ► బ్యాంకుల్లో డిపాజిట్ బీమాను ఒక డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం బ్యాంకు బ్యాలన్స్ షీట్లపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ► బడ్జెట్లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో చేసిన మార్పులు డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. ► తదుపరి ఆర్బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది. మా వద్ద ఎన్నో అస్త్రాలు ‘‘సెంట్రల్ బ్యాంకు వద్ద ఎన్నో సాధనాలున్నాయని గుర్తుంచుకోవాలి. వృద్ధి మందగమనం రూపంలో భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైతే వాటిని సంధిస్తాం’’ అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తద్వారా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికాలో మాదిరే అసాధారణ అస్త్రాలను వినియోగించేందుకు ఆర్బీఐ వెనుకాడదన్న సంకేతం ఇచ్చారు. రేట్లలో మార్పులు చేయకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వృద్ధి తగ్గే రిస్క్ పెరిగిందని... అయితే, పూర్తి ప్రభావంపై అనిశ్చితి ఉందని చెప్పారు. బ్యాంకుల్లోకి రూ.లక్ష కోట్లు లాంగ్‌టర్న్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ (రెపోస్/రుణాలు) ఏడాది, మూడేళ్ల కాల వ్యవధిపై రూ.లక్ష కోట్ల మేర రెపో రేటుకు జారీ చేయనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రెపోస్ అంటే.. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐకి విక్రయించి నిధులు పొందడం. గడువు తీరిన తర్వాత తిరిగి అవి మళ్లీ కొనుగోలు చేస్తాయి. ఇప్పటి వరకు ఆర్బీఐ గరిష్టంగా 56 రోజులకే రెపోస్‌ను ఇష్యూ చేసింది. అందులోనూఒక రోజు నుంచి 15 రోజుల కాలానికే ఎక్కువగా ఉండేవి. మొదటిసారి ఏడాది, మూడేళ్ల రెపోస్‌ను ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గించడమే ఇందులోని ఉద్దేశం. ‘‘మానిటరీ పాలసీ బదిలీ మరింత మెరుగ్గా ఉండేందుకు తీసుకున్న చర్య ఇది. ఎందుకంటే రెపో రేటుకు నిధులను ఇస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను విడుదల చేయాలనుకుంటున్నాం. దాంతో బ్యాంకులు రుణ రేట్లను తగ్గించేందుకు వీలు పడుతుంది’’ అని ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎవరేమన్నారంటే... ఏడాది, మూడేళ్ల లాంగ్‌టర్మ్ రెపోస్ బ్యాంకుల నిధుల వ్యయాలను తగ్గిస్తాయి. దీంతో ఈ ప్రభావాన్ని మరింత మెరుగ్గా రుణగ్రహీతలకు బదిలీ చేయడం వీలు పడుతుంది. రెపో రేట్లను మార్పు చేయకపోవడం ఊహించినదే. అయితే, అభివృద్ధి, నియంత్రణపరమైన చర్యలు ఆర్థిక రంగానికి సానుకూలం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ప్రాజెక్టు రుణాలకు అదనంగా ఏడాది గడువు ఇవ్వడం రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఉపశమనం. – అనుజ్‌పురి, అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆటో, హౌసింగ్, ఎంఎస్ఎంఈ రంగాలకు ఇచ్చే ఇంక్రిమెంటల్ రుణాలకు సీఆర్ఆర్ నుంచి బ్యాంకులకు మినహాయింపునివ్వడం.. ఈ రంగాలకు రుణ వితరణను పెంచి, మందగమనానికి మందులా పనిచేస్తుంది. – కృష్ణన్ సీతారామన్, క్రిసిల్ -
మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో మరింతగా క్షీణించి 4.5%కి పరిమితం అయిన నేపథ్యంలో.. ఆర్బీఐ ఎంపీసీ మరో విడత పావు శాతం వరకు కీలక రేట్ల తగ్గింపును చేపట్టొచ్చనేది నిపుణుల అంచనా. శక్తికాంతదాస్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్బీఐ ఇప్పటిదాకా ప్రతీ భేటీలోనూ రేట్లను తగ్గిస్తూనే వచ్చింది. ఇప్పటి వరకు గత ఏడాది కాలంలో 135 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దేశ వృద్ధి రేటును ప్రగతి బాట పట్టించేందుకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు కూడా. అయితే, ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం ఆర్బీఐ రేట్ల కోతకు సాయపడింది. మరి తాజాగా ద్రవ్యోల్బణం ఎగువవైపు పరుగును ఆరంభించింది. అక్టోబర్‌లో ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి (4.5%)ని దాటుకుని 4.6%కి చేరింది. దీంతో మరో విడత రేట్లపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌లో రేట్ల కోత సమయంలో సర్దుబాటు ధోరణిని ఆర్బీఐ కొనసాగించినందున, ఆర్థిక పరిస్థితులు ఇలానే బలహీనంగా ఉంటే మరో విడత రేట్ల కోతకు అవకాశం ఉంటుందని ఐహెచ్ఎస్ మార్కిట్ ముఖ్య ఆర్థికవేత్త రాజీవ్ బిశ్వాస్ తెలిపారు. ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఈ నెల 3న ప్రారంభం కానుంది. 5న విధాన ప్రకటనపై నిర్ణయం వెలువడుతుంది. -
మందగమనమే... కానీ..?
ఆర్థిక రంగం మందగమన పరిస్థితుల్లో ఉందన్న పలువురు ప్రముఖుల ఆందోళనలను నిజం చేస్తూ... ఇది మందగమనమే కానీ, నిర్మాణాత్మక మందగమనం మాత్రం కాదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. వృద్ధి రేటు వేగాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ ఎంపీసీ భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా వాహన విక్రయాలు క్షీణిస్తుండడం, వినిమయ డిమాండ్ తగ్గుతుండడం ఎంతో మందిని కలవరపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు దాస్. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకునే చర్యలతో, తక్కువ బేస్ ప్రభావంతో వృద్ధి రేటు తిరిగి వేగాన్ని సంతరించుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వృద్ధి రేటును పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకునే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. రంగాలవారీగా చర్యలు ఉంటాయన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను గుర్తు చేశారు. పడిపోయిన డిమాండ్ పెట్టుబడులు, డిమాండ్ రెండూ తగ్గాయని అంగీకరిస్తూ, ఇదే వృద్ధి రేటు పడిపోవడానికి దారితీస్తున్నట్టు దాస్ చెప్పారు. తాజా సమీక్షలో 6.9%కి జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గించిన విషయం గమనార్హం. ‘‘ప్రస్తుతానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు అమ్మకాలు క్షీణించడం, పట్టణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పడిపోవడం ఇదే సూచిస్తోంది. అయితే, డిమాండ్ తిరిగి మెరుగుపడుతుందన్న ఆశాభావంతో ఆర్బీఐ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.5%కి చేరుతుంది’’ అని దాస్ పేర్కొన్నారు. ఆర్బీఐ 1.10 శాతం మేర రేట్లను తగ్గించడం, వ్యవస్థలో సరిపడా లిక్విడిటీ ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉండడం ఇందుకు సాయం చేస్తుందన్నారు. రుణ పంపిణీ పెరుగుతుంది ‘‘రుణాల వితరణ అన్నది ప్రస్తుతం తిరిగి పుంజుకుంది. నేడు తీసుకున్న చర్యలతో వ్యవస్థలో రుణాల జారీని పెంచుతుంది. ఇది వృద్ధి గణాంకాలను పెంచేందుకు తోడ్పడుతుంది’’ అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఒక వంతే బ్యాంకులు బదిలీ చేశాయి ఆర్బీఐ రేట్ల తగ్గింపు స్థాయిలో బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అంగీకరించారు. జూన్ వరకు 75 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించగా, బ్యాంకులు కేవలం మూడింట ఒక వంతు 0.29 శాతాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేసినట్టు చెప్పారు. రేట్లను అధిక స్థాయిలోనే కొనసాగించేందుకు బ్యాంకులు జట్టు కట్టాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. బ్యాంకుల నుంచి అధిక రేట్ల తగ్గింపు బదలాయింపు అన్నది వారాలు, నెలల సమయం పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. తాము తీసుకున్న చర్యల ద్వారా వడ్డీ రేట్ల తగ్గింపు క్రమంగా వ్యవస్థలో కనిపిస్తుందని బ్యాంకులతో తాము నిర్వహించిన సమావేశం ఆధారంగా తెలుస్తోందన్నారు. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు.. ♦ నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.65 శాతంగా ఉన్నాయి. ♦ 2010 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఇంత తక్కువ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ♦ ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఇద్దరు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు 35 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపారు. ♦ వినియోగధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ త్రైమాసికానికి 3.1 శాతంగా, ఆ తర్వాత రెండు త్రైమాసికాల్లో 3.5–3.7 శాతం మధ్య ఉండొచ్చని ఎంపీసీ అంచనా వేసింది. మొత్తం మీద 12 నెలల కాలానికి 4 శాతం లక్ష్యం పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని పేర్కొంది. ♦ చెల్లింపుల మోసాల సమాచారాన్ని తెలియజేసేందుకు కేంద్రీకృత రిజిస్ట్రీ ఏర్పాటుకు నిర్ణయం. ఆర్థిక మోసాలు జరిగితే ఇది సత్వరమే స్పందిస్తుంది. -
ఆర్బీఐ ‘ఉత్కర్ష్ 2022’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ మంగళవారం సెంట్రల్ బ్యాంక్ అంతర్గత మధ్యకాలిక వ్యూహాత్మక విధానం (ఫ్రేమ్‌వర్క్) ‘ఉత్కర్ష్ 2022’ను ఆవిష్కరించారు. ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి తన అత్యుత్తమ నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ, ద్రవ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించడం వంటి లక్ష్యాలతో మూడేళ్ల కాలపరిమితికిగాను ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం జరిగింది. ఫ్రేమ్‌వర్క్ అమలు అంశాలను సెంట్రల్ బోర్డ్ సబ్ కమిటీ ద్వారా కాలానుగుణంగా పర్యవేక్షించడం జరుగుతుంది. నియంత్రణ, పర్యవేక్షణ యంత్రాంగం పటిష్టతకు అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ఈ తరహా ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించి, అమలు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రుణాలిక..బిం‘దాస్’
ముంబై: ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి. గతానికి భిన్నంగా... ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో వడ్డీ రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్, ఆగస్ట్ సమావేశాల్లో ఆర్బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. వృద్ధి కోసమే కోత... ‘‘పెట్టుబడుల ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోణీ రుణ రేటు తగ్గింపు.. ముంబై: ఆర్బీఐ రేట్లు తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏడాది సహా మిగిలిన కాల వ్యవధి రుణాలకు ఇంతకుముందు రేట్లే అమలవుతాయి. ఆరు నెలల రుణాలకు ఇక 8.55 శాతం రేటును బ్యాంకు అమలు చేస్తుంది. చౌకగా రుణాలు... ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి హౌసింగ్ డిమాండ్ జోరు.. ఈ నిర్ణయం గృహ కొనుగోలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఆర్బీఐ కల్పించిన తాజా వెసులుబాటును బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నాం. మరోపక్క, రియల్టీ రంగానికి ద్రవ్య లభ్యత పెరుగుదల దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – జక్సాయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వ్యాపార వర్గాలకు శుభవార్త... తాజా పాలసీలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు, దీనితోపాటు ‘జాగరూకతతో కూడిన కఠిన వైఖరి’ నుంచి ‘తటస్థ’ దిశగా తన పాలసీ వైఖరిని మార్చుకోవడం పారిశ్రామిక రంగానికి శుభవార్తలు. వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరుగుతాయ్. దీనివల్ల వృద్ధి జోందుకుంటుంది. – రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ మరింత తగ్గే సంకేతాలు... దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. దీంతో రేట్ల కోతకు వెసులుబాటు లభించింది. రానున్న కొద్దికాలంపాటు ధరలు కట్టడిలో ఉండే అవకాశాల నేపథ్యంలో రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ పరపతి విధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. – రజ్నీష్ కుమార్, ఎస్బీఐ చీఫ్ పాలసీ ముఖ్యాంశాలు... ► రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం. ► ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. ఆర్బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ► నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది. ► వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు. ► రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి–మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2–3.4 శాతంగా అంచనా. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం. ► జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019–20లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 7.2–7.4 శాతంగాను, అక్టోబర్–డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు. ► చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. ► వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు. ► రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. ► కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత. ► పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల. ► కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి. ► ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు. ► ఆర్బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది. -
నగదు లభ్యత పెంచుతాం : ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత క్షీణిస్తే లిక్విడిటీ పెంపునకు చర్యలు చేపడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. రుణాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ తనను కలిసిన చిన్న, మధ్యతరహా వ్యాపారుల ప్రతినిధులతో ఆర్బీఐ గవర్నర్ సంప్రదింపులు జరిపారు. చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థల రుణాల పునర్వ్యస్ధీకరణపై ప్రతిపాదనలను బ్యాంకులు బేరీజు వేయాలని సూచించారు. నగదు లభ్యతపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నగదు లభ్యత అవసరాలను కేంద్ర బ్యాంక్ పూర్తిస్ధాయిలో పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. అవసరమైతే మరింత లిక్విడిటీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతుందని చెప్పారు. ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నా కేంద్ర బ్యాంక్ పరిధిలోని అంశాలపై తుది నిర్ణయం ఆర్బీఐదేనని తెలిపారు. -
మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి
న్యూఢిల్లీ : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఇపుడు తన దాడిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పై ఎక్కుపెట్టారు. ఆర్ బీఐ రేస్ లోఉన్న శక్తికాంత్ దాస్ పై ట్విట్టర్ లో ఆరోపణలు గుప్పించారు. గురువారం వరస ట్వీట్లతో దాడి చేసిన స్వామి కేంద్ర బ్యాంకు గవర్నర్ పదవి అభ్యర్థిగా వస్తున్న అంచనాల నేపథ్యంలో ... ఆ పదవికి శక్తికాంత్ దాస్ పనికిరాడంటూ వ్యాఖ్యానించారు. 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఎఎస్ అధికారికి వ్యతిరేకంగా ప్రాపర్టీ డీల్ కేస్ పెండింగ్ లో ఉందని కమెంట్ చేశారు. మహాబలిపురం ప్రధాన భూముల ఆస్తి ఒప్పందం విషయంలో వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను కేంద్ర బ్యాంకు ఉన్నత పదవి అభ్యర్థి రేసు నుంచి తప్పించాలని ట్వీట్ చేశారు. దీన్ని ఆర్థిక మంత్రి జైట్లీ కి ట్యాగ్ చేశారు కూడా. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఫైర్ అయ్యి తుఫాన్ సృష్టించిన స్వామి గురువారం తొలగింపు డిమాండ్ ను ఉపసంహరించుకుంటున్నానంటూనే నర్మగర్భంగా ట్విట్ చేశారు. అరవింద్ పెద్ద ఎస్సెట్ గా ప్రభుత్వం భావిస్తే .. తన డిమాండ్ ను వెనక్కి తీసుకుంటున్నాన్నారు. వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడిన ఈ ఫైర్ బ్రాండ్ నిజం నిరూపించడానికి కొంత వేచి ఉంటానన్నారు. -
ఆర్థిక కార్యదర్శిగా శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ : రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న శక్తికాంత్ దాస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న రాజీవ్ మహర్షి ఈ నెల 31న పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఉన్న హస్ముక్ అదియా రెవెన్యూ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న అంజులీ చిబ్ దుగ్గల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. దుగ్గల్ స్థానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొత్తగా తపన్ రాయ్ నియమితులయ్యారు.