మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి | Economic Affairs Secretary Shaktikanta Das next in Subramanian Swamy's line of fire | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి

Published Thu, Jun 23 2016 1:25 PM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి - Sakshi

మళ్లీ ట్విట్టర్ అందుకున్న స్వామి

న్యూఢిల్లీ :  ప్రధాన ఆర్థిక  సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పై  విమర్శలు గుప్పించిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి   ఇపుడు తన దాడిని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి   శక్తికాంత్ దాస్ పై ఎక్కుపెట్టారు.  ఆర్ బీఐ రేస్ లోఉన్న శక్తికాంత్ దాస్ పై ట్విట్టర్ లో  ఆరోపణలు గుప్పించారు.  గురువారం  వరస ట్వీట్లతో దాడి చేసిన స్వామి కేంద్ర బ్యాంకు  గవర్నర్  పదవి అభ్యర్థిగా వస్తున్న అంచనాల నేపథ్యంలో  ... ఆ పదవికి శక్తికాంత్  దాస్ పనికిరాడంటూ   వ్యాఖ్యానించారు.  1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఎఎస్ అధికారికి వ్యతిరేకంగా  ప్రాపర్టీ  డీల్ కేస్ పెండింగ్ లో ఉందని కమెంట్ చేశారు.


మహాబలిపురం  ప్రధాన  భూముల ఆస్తి ఒప్పందం విషయంలో  వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను కేంద్ర బ్యాంకు ఉన్నత పదవి అభ్యర్థి రేసు నుంచి తప్పించాలని ట్వీట్  చేశారు.  దీన్ని ఆర్థిక మంత్రి జైట్లీ కి ట్యాగ్ చేశారు  కూడా.  

 మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఫైర్ అయ్యి తుఫాన్ సృష్టించిన స్వామి గురువారం తొలగింపు డిమాండ్ ను ఉపసంహరించుకుంటున్నానంటూనే నర్మగర్భంగా ట్విట్ చేశారు.  అరవింద్  పెద్ద ఎస్సెట్ గా  ప్రభుత్వం  భావిస్తే .. తన డిమాండ్ ను  వెనక్కి తీసుకుంటున్నాన్నారు. వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడిన  ఈ ఫైర్ బ్రాండ్  నిజం నిరూపించడానికి  కొంత వేచి ఉంటానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement