
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు భారీ షాక్‌ఇచ్చింది. నిబంధనలను పాటించని కారణంగా భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన చెల్లింపుల బ్యాంకునకు రూ.5కోట్ల భారీ జరిమానా విధించింది. కస్టమర్ల నుండి నిర్దిష్ట లేదా స్పష్టమైన అనుమతి లేకుండా ఖాతాలను తెరవడానికి సంబంధించిన కేసులో ఆర్‌బీఐ ఈ పెనాల్టీ విధించింది.
చెల్లింపుల బ్యాంకునకుద్దేశించిన ఆపరేటింగ్ మార్గదర్శకాలు, ముఖ్యంగా కెవైసి నిబంధనలపై ఆర్‌బీఐ ఆదేశాలు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (బ్యాంక్) పై 50 మిలియన్ల రూపాయల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణలు పరిశీలించిన తరువాత బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలిందని ఆర్‌బీఐ తెలిపింది. కాగా జనవరి 15 వ తేదీన బ్యాంకుకు దీనిపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. తమకు తెలియకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడంపై దాదాపు23 లక్షల మంది కస్టమర్ల ఆందోళనకు దారి తీసింది. తద్వారా పేమెంట్స్ బ్యాంకు ఖాతాలకు 47 కోట్ల రూపాయలు మళ్లించినట్టు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment