KYC violation
-
ఒక్క ఆధార్.. 11,000 సిమ్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని అతని సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్.. మెసేజ్లోని లింక్‌పై క్లిక్ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (సీఓఈసీఎస్)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్సైట్లు వంటి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్ పోలీసులు గుర్తించారు. రెండు సిమ్‌లు నేరస్తుల చేతుల్లో.. సాధారణంగా కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్ కార్డులు జారీ చేశారు. కాగా ఇందులో రెండు సిమ్ కార్డులను సైబర్ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగాన్ని సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్!
SBI Warns of KYC Fraud: దేశంలో ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఎస్బీఐ తన వినియోగదారులను హెచ్చరించింది. దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలకు గురి అవుతున్న వారిలో ఎస్బీఐ ఖాతాదారులు ఉండటంతో కేవైసీ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు ఎస్బీఐ కస్టమర్లకు వల వేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. "బ్యాంకు పేరుతో ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా వచ్చే కేవైసీ అప్డేట్ లింక్స్‌ని క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తోంది. ఇటువంటి మోసాల గురుంచి http://cybercrime.gov.inకు నివేదించండి" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవని ఎస్బీఐ చెబుతోంది. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇలాంటి ఎస్ఎంఎస్ మోసాలకు బలైపోవద్దని వినియోగదారులను హెచ్చరించింది. The reality of #KYCFraud has proliferated across the country. The target is sent a text message asking to update their KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42ifaDJ#StateBankOfIndia #CyberCrimeAlert pic.twitter.com/cRydhDQ39H — State Bank of India (@TheOfficialSBI) November 10, 2021 ఆన్లైన్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇలా..? కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపవు. తెలియని వనరుల నుంచి ఎస్ఎమ్ఎస్/ఈ-మెయిల్స్ ద్వారా వచ్చిన అటాచ్ మెంట్/లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. తెలియని వ్యక్తుల నుంచి టెలిఫోన్ కాల్స్/ఈ-మెయిల్స్ ఆధారంగా ఎలాంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, డెబిట్ కార్డు నంబర్, పీన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్వర్డ్, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను ఎవరితో పంచుకోవద్దు. (చదవండి: ఏరులైపారుతున్న తేనే! ఈ ఏడాది 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి) -
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ అలర్ట్!
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. కెవైసీ అప్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులను కోరింది. బ్యాంకు ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, నో యువర్ కస్టమర్(కెవైసీ) డాక్యుమెంట్ల కాపీలు, డెబిట్/క్రెడిట్ కార్డు సమాచారం, పీన్, పాస్ వర్డ్,ఓటీపీ మొదలైన వాటిని గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఏజెన్సీలతో పంచుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించింది. అనధికార వెబ్ సైట్లు, అప్లికేషన్లలో వివరాలను షేర్ చేయవద్దని సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. (చదవండి: కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్!) సెంట్రల్ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఖాతాల కెవైసీ అప్ డేట్ పేరుతో జరుగుతున్న మోసాల వల్ల వినియోగదారులు బలైపోతున్నట్లు ఫిర్యాదులు లేదా నివేదికలు అందినట్లు ఆర్బీఐ తెలిపింది. ఒకవేళ ఎవరైనా కెవైసీ అప్ డేట్ పేరుతో కాల్/మెసేజ్ చేసిన వెంటనే మీ సంబందిత బ్యాంకు/బ్రాంచీని సంప్రదించాలని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. కాల్/సందేశం/అనధికార అప్లికేషన్ ద్వారా కస్టమర్ సమాచారాన్ని పంచుకున్న తర్వాత మోసగాళ్ళు కస్టమర్ ఖాతాను యాక్సెస్ చేసి ఖాతాలో ఉన్న డబ్బు ఖతం చేస్తున్నరని తెలిపింది. కెవైసీ అప్డేట్ ప్రక్రియను చాలా వరకు సరళీకృతం చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇంతకు ముందు, కెవైసీ అప్ డేట్ చేయాల్సిన కస్టమర్ ఖాతాలకు సంబంధించి ఏదైనా రెగ్యులేటర్/ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ/కోర్టు ఆఫ్ లా మొదలైన వాటి ఆదేశాల కింద అవసరం అయితే తప్ప అటువంటి ఖాతా కార్యకలాపాలపై డిసెంబర్ 31, 2021 వరకు ఎలాంటి ఆంక్షలు విధించరాదని నియంత్రిత సంస్థలకు ఆర్బీఐ సలహా ఇచ్చింది. -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కెవైసీ(నో యువర్ కస్టమర్) పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను హెచ్చరించింది. మీకు కెవైసీ ఏమైనా కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటి గురుంచి సైబర్ క్రైమ్ కు తెలియయజేయలని కోరింది. ట్విట్టర్ లో ఒక పోస్టులో "ఎస్బీఐ కెవైసీ పేరుతో జరుగుతున్న మోసం దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుందని. అటువంటి మోసగాళ్లు ఎస్బీఐ ప్రతినిధి పేరుతో పంపిన ఎటువంటి లింక్ పై క్లిక్ చేయవద్దు అని కోరింది". స్కామర్లు టెక్స్ట్ సందేశంలో లింక్ పంపడం, కెవైసీని అప్ డేట్ చేయమని టార్గెట్ వ్యక్తిని అడగడం ద్వారా మోసం చేస్తారని బ్యాంక్ వివరించింది. ఈ విపరీతమైన నేర కార్యకలాపాల గురించి http://cybercrime.gov.in కి నివేదించండి అని అంది. ఈ కరోనా మహమ్మరి కాలంలో ఇటువంటి మోసాలు భారీగా పేరుగుతున్నట్లు సైబర్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితో షేర్ చేయవద్దు అని బ్యాంక్ తెలియయజేస్తుంది. అలాగే ఎస్బీఐ పేరుతో ఇతర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఖాతాదారులను కోరింది. The reality of KYC fraud has proliferated across the country. The target is sent a text message asking to update their #KYC by clicking on a link by someone acting as a bank/company representative. Report such scams at https://t.co/3Dh42iwLvh#CyberCrime #StaySafeStayVigilant pic.twitter.com/Z2UGRFYrol — State Bank of India (@TheOfficialSBI) June 26, 2021 చదవండి: ఆధార్ కు కూడా మాస్క్.. ఇక మీ ఆధార్ నెంబర్ మరింత సురక్షితం! -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు భారీ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు భారీ షాక్ఇచ్చింది. నిబంధనలను పాటించని కారణంగా భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన చెల్లింపుల బ్యాంకునకు రూ.5కోట్ల భారీ జరిమానా విధించింది. కస్టమర్ల నుండి నిర్దిష్ట లేదా స్పష్టమైన అనుమతి లేకుండా ఖాతాలను తెరవడానికి సంబంధించిన కేసులో ఆర్బీఐ ఈ పెనాల్టీ విధించింది. చెల్లింపుల బ్యాంకునకుద్దేశించిన ఆపరేటింగ్ మార్గదర్శకాలు, ముఖ్యంగా కెవైసి నిబంధనలపై ఆర్బీఐ ఆదేశాలు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (బ్యాంక్) పై 50 మిలియన్ల రూపాయల జరిమానా విధించినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణలు పరిశీలించిన తరువాత బ్యాంకుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలిందని ఆర్బీఐ తెలిపింది. కాగా జనవరి 15 వ తేదీన బ్యాంకుకు దీనిపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. తమకు తెలియకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడంపై దాదాపు23 లక్షల మంది కస్టమర్ల ఆందోళనకు దారి తీసింది. తద్వారా పేమెంట్స్ బ్యాంకు ఖాతాలకు 47 కోట్ల రూపాయలు మళ్లించినట్టు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.