
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. కెవైసీ అప్ డేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదారులను కోరింది. బ్యాంకు ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, నో యువర్ కస్టమర్(కెవైసీ) డాక్యుమెంట్ల కాపీలు, డెబిట్/క్రెడిట్ కార్డు సమాచారం, పీన్, పాస్ వర్డ్,ఓటీపీ మొదలైన వాటిని గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఏజెన్సీలతో పంచుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంక్ కస్టమర్లను హెచ్చరించింది. అనధికార వెబ్ సైట్లు, అప్లికేషన్లలో వివరాలను షేర్ చేయవద్దని సెంట్రల్ బ్యాంక్ సలహా ఇచ్చింది. (చదవండి: కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్!)
సెంట్రల్ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఖాతాల కెవైసీ అప్ డేట్ పేరుతో జరుగుతున్న మోసాల వల్ల వినియోగదారులు బలైపోతున్నట్లు ఫిర్యాదులు లేదా నివేదికలు అందినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఒకవేళ ఎవరైనా కెవైసీ అప్ డేట్ పేరుతో కాల్/మెసేజ్ చేసిన వెంటనే మీ సంబందిత బ్యాంకు/బ్రాంచీని సంప్రదించాలని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. కాల్/సందేశం/అనధికార అప్లికేషన్ ద్వారా కస్టమర్ సమాచారాన్ని పంచుకున్న తర్వాత మోసగాళ్ళు కస్టమర్ ఖాతాను యాక్సెస్ చేసి ఖాతాలో ఉన్న డబ్బు ఖతం చేస్తున్నరని తెలిపింది.
కెవైసీ అప్డేట్ ప్రక్రియను చాలా వరకు సరళీకృతం చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇంతకు ముందు, కెవైసీ అప్ డేట్ చేయాల్సిన కస్టమర్ ఖాతాలకు సంబంధించి ఏదైనా రెగ్యులేటర్/ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ/కోర్టు ఆఫ్ లా మొదలైన వాటి ఆదేశాల కింద అవసరం అయితే తప్ప అటువంటి ఖాతా కార్యకలాపాలపై డిసెంబర్ 31, 2021 వరకు ఎలాంటి ఆంక్షలు విధించరాదని నియంత్రిత సంస్థలకు ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment