
ముంబై: ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంక్ నికర లాభం సెప్టెం బర్ క్వార్టర్లో 73 శాతం తగ్గి రూ.54 కోట్లకు చేరింది. మొండి బకాయిల వల్ల రానున్న క్వార్టర్లలో నికర లాభం మరింతగా తగ్గగలదని బ్యాంక్ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 2.60 శాతానికి పెరిగాయని తెలిపారు. గత క్యూ2లో స్థూల మొండి బకాయిలు 1.4 శాతమేనని చెప్పారు.
మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో ఆర్‌బీఎల్ బ్యాంక్ షేర్ 3 శాతం నష్టంతో రూ.286.90 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment