ముంబై: భారతీయులు రికార్డు స్థాయిలో విదేశాలకు డబ్బులు పంపిస్తున్నారు. విదేశాలకు పంపిన రెమిటెన్స్‌ల విలువ జనవరిలో కొత్త గరిష్ట స్థాయి 1.2 బిలియన్ డాలర్లని తాకింది. తల్లిదండ్రులు విదేశీ యూనివర్సిటీల్లో పిల్లల విద్యకు నిధులు సమకూర్చడం, విహారయాత్రలు/టూరిజంపై ఖర్చు చేయడం, విదేశాల్లోని బంధువులకు బహుమతులు/డబ్బులు పంపడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణమని రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల్లో వెల్లడయింది.
భారతీయులు విదేశాలకు పంపిన రెమిటెన్స్‌ల విలువ జనవరిలో 1.2 బిలియన్ డాలర్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో ఇది 8.17 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వీటి విలువ 4.6 బిలియన్ డాలర్లు. బహుమతులు, బంధువుల మెయింటెనెన్స్, ట్రావెల్, ఎడ్యుకేషన్ అనే నాలుగంశాలే మొత్తం రెమిటెన్స్‌లలో 90 శాతానికిపైగా ఆక్రమించాయి. కాగా ఒక భారతీయుడు ఏడాదికి 2,50,000 డాలర్ల వరకు మొత్తాన్ని వారి బంధువుల కోసం విదేశాలకు పంపొచ్చు.
బెంగళూరులో హెచ్‌ఎంజీ స్టోన్ గ్యాలరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్‌ఎంజీ స్టోన్స్ దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ డిజైన్స్ క్యూరేటెడ్ స్టోన్స్ గ్యాలరీని బెంగళూరులో ప్రారంభించింది. 6,500 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ గ్యాలరీని ఇటాలియన్ డిజైన్ సంస్థ స్టూడియో మిలానీ తీర్చిదిద్దింది. హెచ్‌ఎంజీకి బెంగళూరులో 2 తయారీ కేంద్రాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment