తొమ్మిదేళ్లలో ఇదే అతిపెద్ద పతనం
తొమ్మిదేళ్లలో ఇదే అతిపెద్ద పతనం
Published Thu, Jul 6 2017 9:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
పాకిస్తాన్‌లో రూపాయి విలువ భారీగా పడిపోయింది. గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో కిందకి దిగజారింది. వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలకు ముందుగా దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థకు ఒత్తిడి సంకేతాలు చూపుతూ రూపాయి విలువను డీవాల్యుయేట్ చేయడానికి ఆ దేశ కేంద్రబ్యాంకు అనుమతి ఇవ్వడంతో కరెన్సీ విపరీతంగా పడిపోతుంది. బుధవారం అక్కడ స్థానిక సమయం ప్రకారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 3.1 శాతం పడిపోయి 108.1గా నమోదైంది. 2013 డిసెంబర్ తర్వాత ఇదే అత్యంత కనిష్టస్థాయి అని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. ఇంట్రాబ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపుకు సెంట్రల్ బ్యాంకు ఈ డివాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ చెప్పారు.
దీంతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న లోటుకు అడ్డుకట్టవేయొచ్చని, అంతేకాక పడిపోతున్న ఎగుమతులకు కూడా సహకరించవచ్చని కేంద్రబ్యాంకు చూస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది వరకు ఆ దేశ వాణిజ్య గ్యాప్ కూడా 60 శాతం పెరిగింది. అంతేకాక మే నెలతో ముగిసిన 11 నెలల కాలంలో పాకిస్తాన్ కరెంట్ అకౌంట్ గ్యాప్ కూడా రెండింతలు పెరిగి, 8.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి బలం చేకూర్చడంతో కరెంట్ అకౌంట్ లోటును తగ్గించడంతో పాటు, కరెన్సీపై డిప్రిసియేషన్ ఒత్తిడిని కూడా తగ్గించవచ్చని సింగపూర్‌కు చెందిన ఆసియా ఫారిన్ ఎక్స్చేంజ్ స్ట్రాటజిస్ట్ దివ్య దేవేష్ చెప్పారు. కాగ, వచ్చే ఏడాది జరుగబోతున్న ఎన్నికల్లో ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ పోటీ చేయబోతున్నారు.
Advertisement
Advertisement