సాక్షి, ముంబై : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా వినిమయ డిమాండ్ భారీగా క్షీణిస్తోంది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో లాక్ డౌన్ నిబంధనలు పొడిగించనున్నారనే అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీరూపాయి బుధవారం మరింత క్షీణించింది. 75.83 వద్ద ప్రారంభమైన రూపాయి డాలరు మారకంలో 76 మార్కు దిగువకు పడిపోయింది. ఒక దశలో 76.36 ను తాకింది. చివరికి 74 పైసలు తగ్గి 76.37 వద్ద ముగిసింది. కరోనావైరస్ సంక్షోభం డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 6.98 శాతం క్షీణించింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, డాలరు బలం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు రూపాయిని దెబ్బతీశాయని విశ్లేషకులు తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్ కు 32 డాలర్లు పలికింది. ప్రపంచ బెంచ్ మార్క్ ముడి చమురు 3.6 శాతం తగ్గి 31.78 డాలర్లకు చేరుకుంది.డాలర్ ఇండెక్స్ ఆరు ప్రధాన కరెన్సీలతో గత ముగింపుతో పోలిస్తే బలంగా వుంది. (కరోనా భయాలు : మార్కెట్ల పతనం)
మరోవైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిపై పోరాటంలో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ పదిహేనవ రోజుకు చేరింది. దేశంలోని వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసిన లాక్ డౌన్ ను వచ్చే వారం ప్రభుత్వం ఎత్తివేస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలనుంచి పతనమైన చివరికు నష్టాలతో ముగిసాయి. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ట్రేడింగ్ గంటలను కుదించారు. ఏప్రిల్ 17 వరకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment