ముంబై : ఆల్-టైమ్ కనిష్ట స్థాయిలకు పతనమైన రూపాయి విలువ, శుక్రవారం ట్రేడింగ్‌లో కోలుకుంది. ట్రేడింగ్ ప్రారంభంలో 18 పైసలు బలపడి 68.61గా నమోదైంది. బ్యాంకులు, ఎగుమతి దారులు అమెరికా కరెన్సీ డాలర్‌ను విక్రయించడంతో, రూపాయి భారీ పతనం నుంచి తేరుకుంది. ప్రస్తుతం 24 పైసల లాభంలో 68.56గా ట్రేడవుతోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి మొట్టమొదటిసారి 69 స్థాయిన అధిగమించేసి ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి మారింది. ద్రవ్యోల్బణం తీవ్రతరమవడంతో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందనే భయాలు, వాణిజ్య యుద్ధ భయాలు, చమురు ధరల తీవ్రత ఇవన్నీ రూపాయిని బలహీనపడేలా చేశాయి.
అయితే క్షీణిస్తున్న రూపాయి విలువను కాపాడేందుకు బ్యాంకులు, ఎగుమతి దారులు డాలర్ అమ్మకాలు చేపట్టారు. అంతేకాక అంతర్జాతీయంగా కొన్ని కరెన్సీలకు వ్యతిరేకంగా గ్రీన్‌బ్యాక్ కరెన్సీ(డాలర్) బలహీనడపిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో పైకి ఎగియడం కూడా రూపాయికి సహకరించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల నుంచి కోలుకుని 142 లాభంలో, 35,180 వద్ద ట్రేడైంది.
Comments
Please login to add a commentAdd a comment