
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 75.20 వద్ద ప్రారంభమైంది. అనంతరం మరింత ఎగిసి 74.92 ను తాకింది. గత సెషన్ ముగింపుతో పోలిస్తే 16 పైసలు పెరిగింది. శుక్రవారం 75.20 వద్ద స్థిరపడింది.
సానుకూల దేశీయ ఈక్విటీలు, డాలరుబలహీనత నేపథ్యంలో రూపాయికి మద్దతు లభిస్తోందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) డేటాకోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారన్నారు. డాలర్ ఇండెక్స్ 0.19 శాతం పడిపోయి 96.46 కు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.72 శాతం పడిపోయి బ్యారెల్ ధర 42.93 డాలర్లకు చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్ 400 పాయింట్లు ఎ గిసి 37వేల స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ స్థాయినుంచి వెనక్కి తగ్గిన సెన్సెక్స్ 200 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. నిఫ్టీ కూడా ఇదేబాటలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment