
రేపు కడపలో ‘సాక్షి’ మదుపరుల అవగాహన సదస్సు
స్టాక్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలి? భవిష్యత్తు అవసరాల కోసం అనువైన పెట్టుబడులే ంటి? డీమ్యాట్ గురించి సమాచారంతో పాటు ఆర్థిక ప్రణాళిక- పెట్టుబడుల నిర్వహణ.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలి? భవిష్యత్తు అవసరాల కోసం అనువైన పెట్టుబడులే ంటి? డీమ్యాట్ గురించి సమాచారంతో పాటు ఆర్థిక ప్రణాళిక- పెట్టుబడుల నిర్వహణ.. ఇలా అన్ని వివరాలూ అందిస్తున్న సాక్షి మదుపరుల అవగాహన సద స్సు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతోంది. ఇన్వెస్టర్లకు అవసరమైన సలహాలు, సూచనలందిస్తూ ఆర్థిక ప్రగతికి తోడ్పడాలనే ఉద్దేశంతో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో నిర్విహ స్తున్న ఈ సదస్సు ఆదివారం (28వ తేదీ) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కడపలోని యర్రముకపల్లిలో... హోటల్ మానస ఇన్‌లో జరుగుతుంది. సదస్సులో వక్తలుగా సీడీఎస్‌ఎల్ రీజినల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, ఆక్యుమెన్ క్యాపిటల్ మార్కెట్ (ఇండియా) లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ గుప్త, రిలయెన్స్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సీఎఫ్‌పీ, కన్సల్టెంట్ శ్రీనివాస రావులు పాల్గొంటారు. ప్రవేశం ఉచితం. సభ్యత్వ నమోదు కోసం 95055 55020 నంబర్‌కు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.