అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!
అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!
Published Thu, Oct 2 2014 5:09 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. ఎప్పటి నుంచి భారత్ లో అమ్మకాలు ప్రారంభించే అంశంపై ఆపిల్ కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఈ కామర్స్ లో ఈబే సంస్థ ఐఫోన్ 6 ధర 55954 రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 8 తేది నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఆ కంపెనీ నిర్వహకులు వెల్లడించారు.
షాప్ క్లూ.కామ్ అనే మరో సంస్థ 16 జీబీ కెపాసిటి ఐఫోన్6 ధర 59999 వేల రూపాయలుగా, షిప్పింగ్ చార్జీలు 148 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 8 తేదికల్లా 'ఐఫోన్ 6'ను అందిస్తామని షాప్ క్లూ.కామ్ భరోసానిస్తోంది. సెప్టెంబర్ 9 తేదిన మార్కెట్ లోకి విడుదల చేసిన ఆపిల్ కంపెనీ... భారత్ లో అక్టోబర్ చివర్లోగాని, నవంబర్ లోకాని ఐఫోన్6 అమ్మకాల్ని కొనసాగిస్తామని వెల్లడించింది. అమెజాన్, ఇతర కంపెనీలు కూడా ఐఫోన్6 అమ్మకాల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది.
Advertisement
Advertisement