iPhone6
-
ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్లు నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా గూగుల్ రూపొందించిన నెక్సస్ 6, నెక్సస్ 9 ఫోన్లను యూఎస్ తోపాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ఆపిల్ కంపెనీ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటిని తట్టుకునేందుకు కొత్త ప్రోడక్టులను మార్కెట్ తీసుకురావడానికి అక్టోబర్ 16 తేదిన నిర్వహించే ఓ సదస్సులో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గూగుల్ తో కలిసి మోటోరోలా రూపొందిస్తున్న నెక్సస్ 6 ఫోన్ అక్టోబర్ చివరి వారంలో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని.. నవంబర్ మొదటి వారంలో స్టోర్స్ లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. మొబైల్ మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ భారత్ లో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్ వినియోగంలో భారత్ వేగంగా దూసుకుపోతుందని గణాంకాల్ని ఇటీవల ఓ కంపెనీ విడుదల చేసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్6 ప్రీబుకింగ్ షురూ!
భారతదేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అమ్మకాలకు రంగం అప్పుడే సిద్ధమైపోయింది. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ దీని ప్రీబుకింగ్ మొదలుపెట్టేసింది. దీపావళి నాటికల్లా భారతదేశంలో ఐఫోన్6 అందుతుందని ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారానే దీన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఇంతకుముందు చైనా యాపిల్‌గా పేరొందిన ఎంఐ3, రెడ్ ఎంఐ లాంటి ఫోన్లను కూడా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అమ్మారు. వాటికి కూడా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఐఫోన్ 6కు కూడా ఇలాగే ప్రీబుకింగ్‌ను ఫ్లిప్‌కార్ట్ మొదలుపెట్టింది. ఇందులో కూడా పలు రకాల మోడళ్లను ఆఫర్ చేస్తోంది. 16 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 62,500; 16 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 53,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6 అయితే 71,500; 64 జిబి మెమొరీతో కూడిన ఐఫోన్ 6ప్లస్ అయితే 71,500; 128 జిబి మెమొరీ గల ఐఫోన్ 6ప్లస్ అయితే 80,500 చొప్పున ధరలు పెట్టారు. వీటన్నింటికీ ఇప్పటికే బుకింగ్ మొదలైపోయింది. బిగ్ బిలియన్ సేల్ పేరుతో 600 కోట్ల రూపాయల అమ్మకాలు సాధించిన ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఐఫోన్ అమ్మకాలతో మరెంత ముందుకు వెళ్తుందోనని అంతా చూస్తున్నారు. -
అక్టోబర్ 8 కల్లా మీచేతిలో ఐఫోన్6!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ద్వారా ఇండియాలో త్వరలో ప్రవేశపెట్టే 'ఐఫోన్ 6' ధర సుమారు 56 వేల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. ఎప్పటి నుంచి భారత్ లో అమ్మకాలు ప్రారంభించే అంశంపై ఆపిల్ కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఈ కామర్స్ లో ఈబే సంస్థ ఐఫోన్ 6 ధర 55954 రూపాయలుగా నిర్ణయించింది. ఐఫోన్ అమ్మకాలు అక్టోబర్ 8 తేది నుంచి ప్రారంభించే అవకాశం ఉందని ఆ కంపెనీ నిర్వహకులు వెల్లడించారు. షాప్ క్లూ.కామ్ అనే మరో సంస్థ 16 జీబీ కెపాసిటి ఐఫోన్6 ధర 59999 వేల రూపాయలుగా, షిప్పింగ్ చార్జీలు 148 రూపాయలుగా నిర్ణయించింది. అక్టోబర్ 8 తేదికల్లా 'ఐఫోన్ 6'ను అందిస్తామని షాప్ క్లూ.కామ్ భరోసానిస్తోంది. సెప్టెంబర్ 9 తేదిన మార్కెట్ లోకి విడుదల చేసిన ఆపిల్ కంపెనీ... భారత్ లో అక్టోబర్ చివర్లోగాని, నవంబర్ లోకాని ఐఫోన్6 అమ్మకాల్ని కొనసాగిస్తామని వెల్లడించింది. అమెజాన్, ఇతర కంపెనీలు కూడా ఐఫోన్6 అమ్మకాల్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. -
ఐఫోన్6ప్లస్ కెమెరాతో యాపిల్‌కు తలనొప్పులు?
ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన యాపిల్ కంపెనీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో ఒక్కసారిగా తల ఎగరేసింది. అయితే.. ఉన్నట్టుండి ఆ కంపెనీకి ఒక్కసారిగా చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు మోడళ్లలోనూ కెమెరా ఫోన్ నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని 'ద వెర్జ్' వెబ్సైట్ ఎత్తి చూపింది. దీంతో యాపిల్ కంపెనీ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఫొటోలు చాలా భారీసంఖ్యలో వెలువడటంతో దాన్ని తీసేయడం అంత సులభం కాదు. వెర్జ్ వెబ్సైట్ అయితే ఏకంగా తన పేజి మొత్తాన్ని దానికే కేటాయించింది. ఐఫోన్ 6 అయితే 6.9 మిల్లీమీటర్లు, 6ప్లస్ అయితే 7.1 మిల్లీమీటర్లు మాత్రమే మందం ఉంటుందని కంపెనీ చెబుతున్నా.. కెమెరా రింగులతో కలిపి చెబుతున్నారా.. కాదా అనే విషయం తెలియదు. చాలా ఫోన్లలో కెమెరా ఇలా బయటకు వచ్చినట్లు ఉండటం మామూలే అయినా యాపిల్ ఫోన్లలో మాత్రం ఇలా ఎప్పుడూ లేదట. ఇలా ఉండటం వల్ల లెన్సు మీద గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే యాపిల్ పోటీ కంపెనీ అయిన సోనీ.. దీనిమీద సెటైర్లు వేస్తూ ఫేస్బుక్లో పోస్టు కూడా పెట్టేసింది.