ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం! | Nexus 6, 9 may hit Indian mkt soon;Android 5 Lollipop launched | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం!

Published Thu, Oct 16 2014 3:55 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం! - Sakshi

ఐఫోన్ 6 తో పోటికి గూగుల్ నెక్సస్ 6 సిద్ధం!

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ఫోన్లు నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా గూగుల్ రూపొందించిన నెక్సస్ 6, నెక్సస్ 9 ఫోన్లను యూఎస్ తోపాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. 
 
ఆపిల్ కంపెనీ నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటిని తట్టుకునేందుకు కొత్త ప్రోడక్టులను మార్కెట్ తీసుకురావడానికి అక్టోబర్ 16 తేదిన నిర్వహించే ఓ సదస్సులో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గూగుల్ తో కలిసి మోటోరోలా రూపొందిస్తున్న నెక్సస్ 6 ఫోన్ అక్టోబర్ చివరి వారంలో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని.. నవంబర్ మొదటి వారంలో స్టోర్స్ లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. 
 
మొబైల్ మార్కెట్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ భారత్ లో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్ వినియోగంలో భారత్ వేగంగా దూసుకుపోతుందని గణాంకాల్ని ఇటీవల ఓ కంపెనీ విడుదల చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement