
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. తన ‘ఏ సిరీస్’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో రికార్డు సృష్టించినట్లు సోమవారం ప్రకటించింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 20 లక్షల యూనిట్ల విక్రయాలు పూర్తిచేయగా.. వీటి విలువ దాదాపు రూ.3,500 కోట్లని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రంజివిజిత్ సింగ్ వెల్లడించారు.
చిన్న నగరాలు, మెట్రోల నుంచి ఏ50, ఏ30, ఏ10 స్మార్ట్‌ఫోన్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారయన. కంపెనీ నిర్థేశించుకున్న 4 బిలియన్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తంచేశారు. వచ్చే కొద్ది వారాల్లోనే గెలాక్సీ ఏ80, ఏ70, ఏ2 కోర్ విడుదల ఉండనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment