
ఎస్ బీఐ తీపి కబురు
న్యూఢిల్లీ: తమ బ్యాంకులో గృహరుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) తీపికబురు అందించింది. గృహరుణాలపై వడ్డీరేటును ఎస్ బీఐ 0.25 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 10.15 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గించింది. ఇది ఈ నెల 13 (సోమవారం)నుంచి అమల్లోకి వస్తుందని ఎస్ బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి కూడా ఇదే తగ్గించిన వడ్డీరేటు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో గృహరుణ గ్రహీతలకు ఇఎంఐ భారం కాస్త తగ్గుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లు తగ్గించిన రెండు రోజులకు ఎస్ బీఐ కూడా ఇదే బాట పట్టింది. రుణాలపై వడ్డీరేటును హెచ్‌డీఎఫ్‌సీ 0.2 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 9.9 శాతానికి దిగొచ్చింది. కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది.