ముంబై : నెల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరోసారి డిపాజిట్ రేట్లను పెంచింది. రెండేళ్లకు పైగా ఉన్న రిటైల్ కస్టమర్ డిపాజిట్లకు, 1-2 ఏళ్ల కేటగిరీలో ఉన్న కోటికి పైగా ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ రేట్లను 10 నుంచి 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది. నేటి నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని బ్యాంకు తెలిపింది. మరికొన్ని రోజుల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ప్రకటన ఉన్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఏప్రిల్ 5న ఆర్‌బీఐ తన కీలక పాలసీ రేటును ప్రకటించబోతోంది. నేడు పెంచిన ఈ డిపాజిట్ వడ్డీరేట్లు, ముఖ్యంగా ఎఫ్‌డీల్లో కోటి కంటే తక్కువగా డిపాజిట్ ఉన్నవారికి గుడ్‌న్యూస్ అని తెలిసింది. డిపాజిట్ రేట్లతో పాటు ఎస్‌బీఐ వడ్డీరేట్లను కూడా పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
ఎస్‌బీఐ కొత్త డిపాజిట్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి...
రెండేళ్ల కంటే ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువగా ఉన్న కోటి కంటే తక్కువున్న డిపాజిట్ల వడ్డీరేట్లు 6.50 శాతం నుంచి 6.60 శాతం పెరిగింది.
మూడేళ్ల కంటే ఎక్కువగా ఐదేళ్ల కంటే తక్కువగా ఉన్న డిపాజిట్ల వడ్డీరేట్లు 6.50 శాతం నుంచి 6.70 శాతం పెరిగింది
ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకున్న డిపాజిట్ల వడ్డీరేట్లు అంతకముందు 6.50 శాతముంటే, ఇప్పుడు 6.75 శాతం పెరిగింది.
ఎస్‌బీఐ స్టాఫ్, ఎస్‌బీఐ పెన్షనర్లకు అమల్లో ఉన్న రేటు కంటే 1 శాతం ఎక్కువగా చెల్లించనుంది. ఈ రేటు సీనియర్ సిటిజన్లందరికీ, 60 ఏళ్లు పైబడిన ఎస్‌బీఐ పెన్షనర్లకు వర్తించనుంది. ఏడాది కంటే తక్కువ కాలం డిపాజిట్లు కలిగిన వారికి వడ్డీరేట్లు ఫిబ్రవరిలో సమీక్షించిన మాదిరిగానే 5.75 శాతం నుంచి 6.40 శాతం మధ్యలోనే ఉండనున్నాయి. ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాల వ్యవధిలో ఉన్న కోటి, ఆపై మొత్తాల డిపాజిట్లకు వడ్డీరేట్లు 6.75 శాతం నుంచి 7 శాతానికి సమీక్షించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment