భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎస్‌బీఐ | SBI Q4 Loss At Rs 7718 Crores | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎస్‌బీఐ

Published Tue, May 22 2018 3:20 PM | Last Updated on Tue, May 22 2018 10:57 PM

SBI Q4 Loss At Rs 7718 Crores - Sakshi

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఫైల్‌ ఫోటో)

ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి క్వార్టర్‌లో బ్యాంకు నష్టాలు రూ.7,718 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు గతేడాది కంటే ఈ త్రైమాసికంలో రెండింతలు పెరగడంతో బ్యాంకు తీవ్ర నష్టాలను నమోదుచేసింది. మొండి బకాయిలు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.11,740 కోట్లు ఉంటే, ఈ ఏడాది రూ.28,096 కోట్లకు పెరిగాయి. ఎన్‌పీఏ ప్రొవిజన్లు కూడా క్యూ4లో పెరిగినట్టు తెలిసింది. స్ట్రీట్‌ అంచనాలను మించి బ్యాంకు నష్టాలను మూటగట్టుకుంది. బ్యాంకు కేవలం రూ.1,795 కోట్ల నష్టాలను మాత్రమే రిపోర్టు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. కానీ వారి అంచనాలకు మించి భారీ మొత్తంలో ఎస్‌బీఐ నష్టాలను పొందినట్టు తెలిసింది. 

డిసెంబర్‌ క్వార్టర్‌లో కూడా బ్యాంకు రూ.2,413.37 కోట్ల నష్టాలను గడించింది. మొత్తం అడ్వాన్స్‌ల్లో స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 10.91 శాతానికి పెరిగాయి. ఇవి డిసెంబర్‌ త్రైమాసికంలో 10.35 శాతంగానే ఉండేవి. బ్యాంకు మొత్తం ఆదాయం ఈ జనవరి నుంచి మార్చి కాలంలో రూ.68,436.06 ​కోట్లగా నమోదైనట్టు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు ఆదాయం రూ.57,720.07 ​కోట్లు ఉన్నాయి. ఈ మార్చి త్రైమాసికంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అనంతరం అత్యధిక నష్టాలను నమోదు చేసిన రెండో బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియానే. నీరవ్‌ మోదీ కుంభకోణ నేపథ్యంలో పీఎన్‌బీ బ్యాంకు రూ.13,417 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బ్యాంకు 5.2 శాతం పైకి ఎగిసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement