
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ స్కూటర్స్ ఇండియా సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు తోడ్పడే దిశగా ఖాతాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నష్టాలకు ప్రతిగా ప్రభుత్వ ఈక్విటీని రూ.85.21 కోట్ల మేర తగ్గించడం ద్వారా ఖాతాలను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
దీనికి అనుగుణంగా 2012–13 తర్వాత నుంచి స్కూటర్స్ ఇండియా బ్యాలెన్స్ షీట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని పేర్కొంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహంలో భాగంగా.. స్కూటర్స్ ఇండియాలో 100 శాతం వాటాలను విక్రయించేందుకు భారీ పరిశ్రమల శాఖ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment