సాక్షి, ముంబై : దేశీయస్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ సంకేతాలతో ఆరంభంనుంచి సానుకూలంగా వున్న సూచీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ఆర్బీఐ అందించిన భరోసా (రూ. 50వేల కోట్ల లిక్విడిటీ సాయం) మరింత ఎగిసాయి. ప్రధానంగా నిఫ్టీ బ్యాంకు భారీగా పుంజుకుంది. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 770 పాయింట్లకు పైన లాభపడగా, నిఫ్టీ 93 వందలకు ఎగువన స్థిరంగా ట్రేడ్ అయింది. చివరికి సెన్సెక్సె 416 పాయింట్ల లాభంతో 31743 వద్ద, నిఫ్టీ 128 9282 వద్ద ముగిసాయి. ప్రధానంగి ఇండస్ ఇండ్ , బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ మహీంద్ర, హిందాల్కో, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, టాప్ విన్నర్గా నిలిచాయి. మరోవైపు ఎంఅండ్ ఎం, ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్సీ, డా.రెడ్డీస్, గ్రాసిం, ఐటీసీ, భారతి ఎయర్టెల్ నష్టపోయాయి. (కరోనా కట్టడి ఆశలు : లాభాల్లో మార్కెట్లు)
అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం భారీగా పుంజుకుంది. 76.17 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన రూపాయి డే లో 76.05 స్థాయిని తాకింది. చివరికి 76.24 వద్ద ముగిసింది. గత సెషన్ లో 76.46 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. (మ్యూచువల్ ఫండ్లకు ఆర్‌బీఐ భారీ ప్యాకేజీ)
Comments
Please login to add a commentAdd a comment