సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక సూచీలు పటిష్టంగా ట్రేడింగ్ ను ఆరంభించాయి. ప్రధానంగా కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి అదనపు చర్యలు అంచనాలతో పెట్టుబడిదారుల ఆసక్తితో ఆసియా మార్కెట్లు లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌ను ప్రారంభించాయి. ఈ వారం జరగనున్న బ్యాంకు ఆఫ్ జపాన్ సమావేశాల్లో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించనుందని భావిస్తున్నారు.
సెన్సెక్స్ 529 పాయింట్లు ఎగిసి 31868 వద్ద, నిప్టీ 169 పాయింట్లు లాభపడి 9313 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా నిఫ్టీ 93 వందల స్థాయిని అధిగమించింది. దాదాపు అన్నిరంగాల షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సిప్లా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంకు, భారతి ఇన్ ఫ్రాటెల్, రిలయన్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మ లాభ పడుతున్నాయి. ఎన్టీపీసీ, విప్రో నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment