బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం | Sensex crashes over 1,500 pts; investors lose over Rs 3 lakh crore | Sakshi
Sakshi News home page

బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం

Published Mon, Aug 24 2015 2:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం

బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం

ముంబై: స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం. ఊహించని నష్టాలతో  స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మూడో అతిపెద్ద పతనంతో సోమవారం స్టాక్ మార్కెట్ పాలిట బ్లాక్ మండేగా పరిణమించింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్  సుమారు 1500 పాయింట్లు పతనమై 26వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.

ఎన్ఎస్ఈ నిఫ్టీ 7900 పాయింట్ల కిందకు పతనమైంది. నిఫ్టీలోని 50 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలోని 500 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే నష్టాల బారిన పడకుండా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపోయినట్టు అంచనా. ఏడున్నరేళ్లలో ఇదే అతిపెద్ద నష్టం కాగా, స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడోది. 2008, జనవరి 21న సెన్సెక్స్ 2,062 పాయింట్లు పతనమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement