
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 20 పాయింట్లు పడిపోయి 27,186కు చేరుకుంది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 8,137 వద్ద ట్రేడవుతోంది.
మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తోంది. రియాల్టీ, కన్జుమర్ డ్యురబుల్, కేపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ, మెటల్ వాటాలు బాగా నష్టపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లతో బలహీన ట్రెండ్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు అంటున్నారు.