ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనపడటం , అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పడిపోవడంతోపాటు మంగళవారం ఆర్‌బిఐ పరపతి విధానంపై ఉండే అనుమానాలు వెరసి మార్కెట్లు నష్టాల్లో ముగిసేలా చేశాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో 29,122పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8797 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక సెక్టార్ వైజ్ సూచీల్లో ఎఫ్‌ఎమ్‌సిజి 1.77 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.54 శాతం నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్ 1.25 శాతం , ఐటి సూచీలు 1శాతం , ఆటో సూచీలు 0.46 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో హెచ్‌సిఎల్ టెక్ 5.71 శాతం, యాక్సెస్ బ్యాంక్ 5.18 శాతం, హిందాల్కో 3.87 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో ఏషియన్ పెయింట్స్ 5.75 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.88 శాతం నష్టపోయాయి.