సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800 | Sensex Hits All Time High On First Trading Day | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800

Published Mon, Nov 4 2019 6:17 AM | Last Updated on Mon, Nov 4 2019 6:17 AM

Sensex Hits All Time High On First Trading Day - Sakshi

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గించడం, అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌తో పాటు  అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసికట్టుగా  కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు గరిష్టస్థాయికి మరో 1.8 శాతం దూరంలో వుంది.

కొద్దినెలలుగా ఎన్‌పీఏలు, కార్పొరేట్‌ డిఫాల్ట్‌లు వంటి ప్రతికూలాంశాలతో సతమతమవుతున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ షేర్ల వెయిటేజి ఎక్కువగా వున్నందున, నిఫ్టీ...సెన్సెక్స్‌కంటే వెనుకబడి వుంది. వచ్చే కొద్దిరోజుల్లో నిఫ్టీ కొత్త గరిష్టస్థాయిని నమోదుచేయలేకపోతే...మార్కెట్లో స్వల్పకాలిక కరెక్షన్‌ జరగవచ్చు. నిఫ్టీ సైతం సెన్సెక్స్‌ను అనుసరించగలిగితే, రెండు నెలలపాటు మార్కెట్లో పెద్ద ర్యాలీని చూసే ఛాన్స్‌ వుంటుంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌1తో ముగిసిన వారంలో  సెన్సెక్స్‌ 40,392 పాయింట్ల స్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొలి్పంది. చివరకు అంతక్రితం వారం ముగింపు (గత ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌ ముగింపు)తో పోలిస్తే   915 పాయింట్ల భారీలాభంతో 40,165 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే సెన్సెక్స్‌ 40,400–40,500 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చు.  ఈ స్థాయిపైన ముగిస్తే 40,700 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు.

అటుపైన క్రమేపీ 40,900 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది.  ఈ వారం తొలి నిరోధస్థాయిని ఛేదించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 39,920–39,800 శ్రేణి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిపైన స్థిరపడితే మార్కెట్‌ స్వల్పకాలంలో పెరిగే అవకాశాలుంటాయి. ఈ మద్దతుశ్రేణిని కోల్పోతే 39,500 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున  39,240 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.  

నిఫ్టీ తొలి మద్దతుశ్రేణి 11810–11,785....
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  11.695 కీలక నిరోధస్థాయిపై ముగిసినంతనే వేగవంతమైన ర్యాలీ జరిపి 11,945 గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 264 పాయింట్ల లాభంతో 11,891 వద్ద ముగిసింది. 11,980– 12,100 మధ్య పలు సాంకేతిక అవరోధాలున్నందున, నిఫ్టీకి ఈ వారం కీలకమైనది.  ఈ సోమవారం నిఫ్టీ పెరిగితే 11,945–11,980 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.

అటుపైన ముగిస్తే 12,040 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన 12,110 సమీపంలో కొత్త రికార్డును నెలకొల్పే ఛాన్స్‌ వుంటుంది. ఈ తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే నిఫ్టీ బలహీనపడి 11,810–11,785 వద్ద లభిస్తున్న తొలి మద్దతుశ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,680 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,645 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement