ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 216 పాయింట్లకు ఎగసి 27, 723 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 8,300 పాయింట్లను దాటింది. ఈ రోజు నిఫ్టీ 60కు పైగా పాయింట్లను లాభపడింది. ప్రధానంగా సెన్సెక్స్ షేర్లు రిలయన్స్, టాటా మోటర్స్, హెచ్ డీ ఎఫీ సీ , ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి.
గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుల కారణంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో కొత్త ఏడాది ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సెన్సెక్స్ 27,395-27,546 కనిష్ట, గరిష్టా స్థాయిల మధ్య ట్రేడైంది. చివరికి 8 పాయింట్ల లాభంతో 27,508 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 8,284 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ఐదు సెషన్లలోనూ సెన్సెక్స్ 299 పాయింట్లు లాభపడింది.