ముంబై: సోమవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 126పాయింట్ల నష్టంతో 26,641దగ్గర నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో 8,069 దగ్గర ట్రేడవుతున్నాయి.
బ్యాంకింగ్, ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంది. మెటల్ సెక్టార్లో మాత్రం కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది.