ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: గురువారం స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అనంతరం నష్టాలనుంచి కోలుకొని స్వల్ప లాభాల్లోకి (ఫ్లాట్) మారాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27,957 దగ్గ,నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,497 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటి, హెల్త్కేర్ రంగ షేర్లపై ఇన్వెస్టర్లు దృఫ్టి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ముఖ్యంగా ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతోంది.
అటు రూపాయ విలువలో కొనసాగుతున్న క్షీణత దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ప్రపంచ మార్కెట్లు కూడా బలహీనంగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. స్పానిష్, చైనా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.
అయితే గురువారం కరెన్సీ మార్కెట్లో డాలర్తో పోలిస్తే చైనా యువాన్ విలువ కొంచెం మెరుగుపడింది. రూపాయి కూడా నష్టాలనుంచి కొంచెం కోలుకున్నా 65 రూపాయల దిగువ స్థాయిలోనే ఉంది.