ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
ముంబై: గురువారం నాటి మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాల్లో మొదలైనా లాభాల వైపు మళ్లాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 28,519 దగ్గర, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8,636 దగ్గర ట్రేడవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు, బిల్లులు ఆమోదంపై మార్కెట్ కదలికలు ఆధారపడవచ్చు. ముఖ్యంగా జీఎస్టీ బిల్లుకు ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు రూపాయ పతనం కొనసాగుతోంది. ఏడుపైసల నష్టంతో 63.65 దగ్గర ఉంది.