trades
-
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాలతో ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27,941వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 8,638 వద్ద ముగిశాయి. ఆరంభ నష్టాలనుంచి మార్కెట్లు కోలుకుని దాదాపు 75 పాయింట్లకు పైగా ఎగిసినా చివరికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయికి దిగువనే ముగిశాయి. మెటల్, ఆటో, లాభాలు మార్కెట్ ను లాభాలవైపు నడిపించాయి. అలాగే పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు కూడా లాభపడ్డాయి.ముఖ్యంగా వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రభావం ఆయా షేర్లలో కనిపించింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రభావంతో నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ షేర్లు35 శాతానికిపైగా కుప్పకూలాయి. మరోవైపు ఐషర్ మోటార్ కూడా అంచనాలను మించిన ఫలితాలను నమోదు చేసిన 413 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఐసీఐసీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిప్లా, భారతి ఎయిర్ టెల్ నష్టపోగా బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. ఐసీఐసీఐ టాప్ లూజర్ గా, టెక్ మహీంద్ర టాప్ గెయినర్ గా నిలిచింది. 'సంవాత్' కొత్త మార్కెట్ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం దీపావళి మూరత్ ట్రేడింగ్ ను గంటపాటు నిర్వహించనున్నట్టు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 నిమిషాలనుంచి ఈ ట్రేడింగ్ మొదలవుతుందని తెలిపాయి. అటు 0.06 పైసల నష్టంతో రూ.66.81వద్దరూపాయి బలహీనందిగా ఉంది. మరోవైపు ధంతేరస్ సందర్భంగా బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రాముల పుత్తడి 72 రూపాయలు తగ్గి, రూ. 29,855 వద్ద వెలవెల బోతోంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అనంతరం నష్టాలనుంచి కోలుకొని స్వల్ప లాభాల్లోకి (ఫ్లాట్) మారాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27,957 దగ్గ,నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,497 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటి, హెల్త్‌కేర్ రంగ షేర్లపై ఇన్వెస్టర్లు దృఫ్టి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ముఖ్యంగా ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతోంది. అటు రూపాయ విలువలో కొనసాగుతున్న క్షీణత దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ప్రపంచ మార్కెట్లు కూడా బలహీనంగానే ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. స్పానిష్, చైనా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. అయితే గురువారం కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్ విలువ కొంచెం మెరుగుపడింది. రూపాయి కూడా నష్టాలనుంచి కొంచెం కోలుకున్నా 65 రూపాయల దిగువ స్థాయిలోనే ఉంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం నాటి మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాల్లో మొదలైనా లాభాల వైపు మళ్లాయి. సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 28,519 దగ్గర, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8,636 దగ్గర ట్రేడవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలు, బిల్లులు ఆమోదంపై మార్కెట్ కదలికలు ఆధారపడవచ్చు. ముఖ్యంగా జీఎస్టీ బిల్లుకు ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రూపాయ పతనం కొనసాగుతోంది. ఏడుపైసల నష్టంతో 63.65 దగ్గర ఉంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా , స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో 26,531దగ్గర నిఫ్టీ ఒక పాయింట్ నష్టంతో 8,043 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంది. మరోవైపు యూస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు లాభపడి 63.92 దగ్గర ఉంది. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: సోమవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 126పాయింట్ల నష్టంతో 26,641దగ్గర నిఫ్టీ 45పాయింట్ల నష్టంతో 8,069 దగ్గర ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి భారీగా ఉంది. మెటల్ సెక్టార్లో మాత్రం కొనుగోళ్ల ట్రెండ్ కనిపిస్తోంది. -
ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో 27,592 దగ్గర, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 8,356 దగ్గర ట్రేడవుతున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్స్‌గా నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక సెక్టార్ సూచీల్లో ఐటి సూచీలు 0.39శాతం, హెల్త్ కేర్ సూచీలు 0.47శాతం, పవర్ సూచీలు 0.46శాతం నష్టపోతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో గెయిల్ 1.85శాతం, హీరో మోటోకార్ప్ 1.19శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.01 శాతం నష్టపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో టెకెమ్ 2.04శాతం, టాటామోటార్స్ 1.82శాతం, సన్ ఫార్మా1.61శాతం ,ఎన్టిపిసి 1.30శాతం నష్టపోతున్నాయి. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబైః గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 27,844 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 8,428 దగ్గర ట్రేడవుతున్నాయి. రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటీ సెక్టార్లో కొనుగోళ్లు కనిపిస్తోంటే, మెటల్ రంగంలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. -
ఘాటెక్కిన ఉల్లి
నల్లగొండ టౌన్: ఉల్లి ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. ఒక్కసారిగా ధర పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు ధర పలికిన ఉల్లి ప్రస్తుతం రిటేల్‌లో రూ. 22 నుంచి రూ.24 వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో రూ.12 మాత్రమే ధర ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితులలో జిల్లాలో ఎక్కడా కూడా ఉల్లిసాగు లేకపోవడంతో పాటు జిల్లాకు ఉల్లిగడ్డలను సరఫరా చేసే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాంతో ఉల్లి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకు మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, గుజరాత్ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దాంతో పాటు ఉన్న సరుకులను హోల్‌సేల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్ల కూడా ధరలు పెరిగా యి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో దళారులు ధరలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి గతంలో ప్రతి రోజూ మూడు లారీల ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండేది. కానీ ప్రస్తుతం రెండు లారీలు మాత్రమే వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగనున్నాయి.మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉల్లిగడ్డలను బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసా రించని కారణంగా వ్యా పారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధరలను పెంచుతున్నారనే విమర్శలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాయంత్రాం గం స్పందించి బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని, ఉల్లిగడ్డ ధరలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉల్లి లేకుండానే కూరలు పెరిగిన ధరల కారణంగా ఉల్లిగడ్డ లేకుండానే కూరలు వండుకోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. - కె.సరోజ తక్కువ ధరకు ప్రభుత్వమే అమ్మాలి ఉల్లిధరలు సా మాన్యులకు అం దుబాటులో లేకుండా పో యాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లిగడ్డలను తక్కువ ధర కు అమ్మడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ధరలను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి. - కాంతయ్య