ముంబై: మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల నష్టంతో 27,592 దగ్గర, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 8,356 దగ్గర ట్రేడవుతున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్స్గా నష్టాలు కొనసాగుతున్నాయి.
ఇక సెక్టార్ సూచీల్లో ఐటి సూచీలు 0.39శాతం, హెల్త్ కేర్ సూచీలు 0.47శాతం, పవర్ సూచీలు 0.46శాతం నష్టపోతున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో గెయిల్ 1.85శాతం, హీరో మోటోకార్ప్ 1.19శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.01 శాతం నష్టపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో టెకెమ్ 2.04శాతం, టాటామోటార్స్ 1.82శాతం, సన్ ఫార్మా1.61శాతం ,ఎన్‌టిపిసి 1.30శాతం నష్టపోతున్నాయి.