
సాక్షి, ముంబై : భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కీలక సూచీలు ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 914 పాయింట్లు కుప్పకూలి 32623 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు పతనమై 9643 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్ సహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో సెన్సెక్స్ 33 వేల స్టాయిని నిలబెట్టుకోలేకపోయింది. అటు నిఫ్టీ కూడా 9650 దిగువకు చేరింది. బ్యాంకు నిఫ్టీ 800 పాయింట్లు పతనమైంది.
అటు డిష్ టీవీ , అలోక్ ఇండస్ట్రీస్ మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, హిందాల్కో , మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి