ఈక్విటీ మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైందని మార్కెట్ విశ్లేషకుడు శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం పాటు ఈ స్మాల్‌క్యాప్ షేర్ల హావా కొనసాగుతుందని శర్మ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతానని శర్మ తెలిపారు. తన పోర్ట్‌ఫోలియో మొత్తంలో 67శాతం స్మాల్‌క్యాప్స్, మిడ్ క్యాప్స్ రంగానికి చెందిన షేర్లు ఉన్నాయని తెలిపారు. భారత్‌తో సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లో ఇప్పటికే స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ ప్రారంభమైందని, గడచిన 4-5 ట్రేడింగ్ సెషన్లలో లార్జ్‌క్యాప్స్ షేర్ల ర్యాలీని అధిగమించాయని శర్మ తెలిపారు. ఇలాంటి సంఘటన చూసి చాలా ఏళ్లైందని శర్మ చెప్పారు.
‘‘2017లో స్మాల్‌క్యాప్స్ షేర్లు గొప్ప ర్యాలీని చేశాయి. తరువాత 2018, 2019ల్లో అదే ప్రదర్శన కొనసాగింది. 2007 గరిష్టాల నుంచి ఈ షేర్లు దాదాపు 55-60 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పుడు తిరిగి ర్యాలీని ప్రారంభించాయి. కేవలం భారత్‌లోనే కాక మొత్తం ప్రపంచ మార్కెట్లలో స్మాల్‌క్యాప్ షేర్ల గణనీయమైన ర్యాలీని చూస్తున్నాము.’’ అని శర్మ తెలిపారు. స్మాల్‌క్యాప్ షేర్లలో అత్యధిక అస్థిరత ఉంటుంది. తొందరపడి గుడ్డిగా కొనడం అత్యంత ప్రమాదం. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమని శర్మ ఈ సందర్భంగా తెలిపారు.
వాస్తవానికి భారత్ ఈక్విటీ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్ల ర్యాలీతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. బ్రెజిల్ మార్చి కనిష్ట స్థాయి నుండి 50 శాతం పెరిగిన సంగతి ఈ సందర్భరంగా ఆయన గుర్తు చేశారు. స్టాక్స్ ర్యాలీ ఎల్లప్పుడూ నిజమైన ఆర్థిక వ్యవస్థతో చేతులు కలపవలసిన అవసరం లేదు. చౌకైన డబ్బుతో ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఫండమెంటల్స్ లేకుండానే స్టాక్స్ మార్కెట్లు పెద్ద ర్యాలీని చేస్తాయి. ఈ సూత్రం అర్థిక అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మార్కెట్లతో పాటు అన్ని మార్కెట్లకు కూడా వర్తిస్తుందని శర్మ తెలిపారు.
బీఎస్‌ఈ గణాంకాలను పరిశీలిస్తే వారంలో రోజుల్లో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4శాతం లాభపడింది. ఇదే ఇండెక్స్ గడచిన నెలరోజుల్లో 12శాతం ర్యాలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment