Large cap stocks
-
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రానున్న రెండు మూడేళ్లలో మార్కెట్ జోరు, లార్జ్ క్యాప్ కంపెనీలపై ఫోకస్
గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లు కనిపించాయి. కరోనా రాకతో కుదేలైన స్టాక్ మార్కెట్ ఆ తర్వాత ఊహించని రీతిలో కోలుకుని భారీ ర్యాలీతో జీవిత కాల గరిష్టాలకు చేరుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని.. దీంతో వచ్చే రెండు మూడేళ్ల కాలంలోనూ ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. దీంతో లార్జ్ క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ పథకం నమ్మకమైన పనితీరును దీర్ఘకాలంగా నమోదు చేస్తూ వస్తోంది. లార్జ్‌క్యాప్ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్ ఉన్నా ఫర్వాలేదు.. దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఈ పథకాన్ని తమ పోర్ట్‌ఫోలియోలోకి పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి. రాబడులు దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 19.38 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్ బ్లూచిప్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. వార్షికంగా 18 శాతం రాబడులను అందించింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 16.64 శాతం చొప్పున ఈ పథకం పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తీసుకొచ్చి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ.లక్షను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ.1.70 లక్షలు అయి ఉండేది. నిర్వహణ విధానం ఈ పథకం నిర్వహణలో రూ.32,213 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో ప్రస్తుతానికి 96.3% ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. డెట్ సాధనాల్లో 2.6%, నగదు నిల్వలను 1.1% చొప్పున కలిగి ఉంది. మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడుల వ్యూహాలతో రాబడులను కాపాడే విధానాలను ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థా యిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ నగదు నిల్వలను పెంచుకోవడం, దిద్దుబాటుల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవడం వంటివి ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 34 స్టాక్స్ ఉన్నాయి. 99% పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడాన్ని చూస్తే.. గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద సమీప కాలంలో లార్జ్‌క్యాప్ స్టాక్స్ బలం గాను, స్థిరంగాను ఉంటాయని ఫండ్ బందం అంచనా వేస్తోందని అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కేవలం ఒక్క శాతమే కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్‌కే ఈ పథ కం ప్రాధాన్యం ఇచ్చింది. 38% పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. టెక్నాలజీ రంగ స్టాక్స్‌కు 19%, సేవల రంగ కంపెనీలకు 7.77% చొప్పున కేటాయింపులు చేసింది. -
స్థిరమైన రాబడులకు దారి..!
గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి ఏడాదిలోపే రెట్టింపునకు పైగా పెరిగి రికార్డులు సృష్టించాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన పథకాలు ఏవని పరిశీలిస్తే కేవలం కొన్నే పథకలు కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. కరోనా కారణంగా కుదేలైన మన దేశ ఆర్థిక వ్యవస్థ.. వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత తిరిగి అంతే వేగంగా కోలుకుంటుందని నిపుణుల అంచనా. ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడం అన్నది ఈక్విటీ మార్కెట్లకు అనుకూలైన మైన విషయమే. దీంతో ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లపాటు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. చారిత్రకంగా చూస్తే స్వల్ప కాలంలోనే ఈ అస్థితరలు ఉంటాయేమో కానీ.. దీర్ఘకాలంలో (కనీసం పదేళ్లు ఆ పైన) ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని ఎన్నో ఆధారాలున్నాయి. కనుక ఇన్వెస్టర్లు మెరుగైన రాబడుల కోసం.. అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి పరిమిత రిస్క్ తీసుకునే వారు నాణ్యమైన లార్జ్‌క్యాప్ (మార్కెట్ విలువ పరంగా టాప్–100) పథకాలను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఒకవేళ మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లార్జ్‌క్యాప్ కంపెనీలు సమర్థవంతంగా అధిగమించగలవు. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం మంచి రాబడుల చరిత్ర కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు ఏ కాల వ్యవధికి పరిశీలించినా కానీ యాక్సిస్ లార్జ్‌క్యాప్ ఫండ్ రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ అగ్రగామిగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 44 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 15 శాతం, ఐదేళ్ల కాలంలో 16 శాతం చొప్పున ఉన్నాయి. ఏడేళ్లలోనూ వార్షికంగా 14 శాతం రాబడినిచ్చింది. పదేళ్ల కాలంలో వార్షిక రాబడి 14 శాతం చొప్పున ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్ రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఏడాది కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాల వ్యవధుల్లోనూ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం నిర్వహణలో జూన్ చివరికి రూ.28,233 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే (2010 జనవరి) వార్షిక రాబడి 13.35 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక తన పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని చిన్న కంపెనీలకు కేటాయిస్తుంది. కానీ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకం దాదాపు పెట్టుబడులన్నింటినీ లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడం గమనార్హం. మెగా, లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే 99 శాతం ఇన్వెస్ట్ చేయగా.. ఒక శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ప్రస్తుతం ఈ పథకం తన వద్దనున్న పెట్టుబడుల్లో 95.5 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 4.5 శాతాన్ని డెట్ సాధనాల్లో పెట్టి ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే మంచి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకునేందుకు గాను ఈ మేరకు డెట్ హోల్డింగ్స్‌ను కలిగి ఉందని భావించొచ్చు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లోనే 37 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి ఉంది. -
మేలో మ్యూచువల్ ఫండ్లు కొన్న టాప్-5 లార్జ్ క్యాప్ షేర్లివే..!
మ్యూచువల్ ఫండ్లు మే నెలలో లార్జ్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సడలింపు తర్వాత దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని కంపెనీల లాభాలు తిరిగి బౌన్స్‌బ్యాక్ కావచ్చనే అంచనాలతో మ్యూచవల్ ఫండ్లలో నెలకొన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు మేనెలలో కొనుగోలు చేసిన టాప్-5 కంపెనీల షేర్లను పరిశీలిద్దాం... షేరు పేరు: బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్: రూ.1,47,351 కోట్లు మ్యూచువల్ ఫండ్: ఐసీఐసీఐ ప్రు మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ: ఈ షేరు ఇటీవల భారీ పతనాన్ని చవిచూసి సరసమైన ధరలో ట్రేడ్ అవుతూ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లను ఆకర్షిస్తోంది. బలమైన మేనేజ్మెంట్తో పాటు అధిక లిక్విడిటిని కలిగి ఉండటంతో ఈ షేరు కొనుగోలుకు మ్యూచువల్ ఫండ్లు మొగ్గుచూపాయి. ఏది ఏమైనా మారిటోరియం విధింపు నేపథ్యంలో కంపెనీకి స్వల్పకాలం పాటు మొండి బకాయిల సమస్య నెలకొనవచ్చు. మరో ఏడాది కాలం ‘‘వృద్ధి’’ అనే అంశం సవాలుగా మారుతుంది. షేరు పేరు: బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్: రూ. 80,972 కోట్లు మ్యూచువల్ ఫండ్: కోటక్ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ: బ్రిటానియా ఉత్పత్తులు అత్యవసర, గృహాల్లో వినియోగ వస్తువులుగా మారాయి. లాక్డౌన్ సమయాల్లో కూడా కంపెనీ ఉత్పత్తుల పంపిణీ, రవాణాకి ఎలాంటి అంతరాయాలు ఏర్పడలేదు. డీలర్లు, అమ్మకందారులు సజావుగా బ్రిటానియా ఉత్పత్తులను విక్రయించగలిగారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు మరింత పెరిగాయి. మే నెలలో ఈ కంపెనీ షేరు 10శాతం పెరిగింది. అయితే ఎర్నింగ్‌తో పోలిస్తే షేరు ధర 44రెట్లు అధికంగా ట్రేడ్ అవుతోంది. ఈ ధర వద్ద వాల్యూయేషన్లు చౌకగా లేవు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాల్యూయేషన్లు ప్రత్యర్థి కంపెనీల కంటే అధికంగా లేవు. షేరు పేరు: ఏషియన్ పేయింట్స్ మార్కెట్ క్యాప్: రూ.1,57, 111 కోట్ల మ్యూచువల్ ఫండ్: ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ: పెయింటింగ్ మార్కెట్లో అధిక వాటాను కలిగి ఉంది. బలమైన పంపిణీ నెట్వర్క్, ఉత్తమ రిటర్న్ నిష్పత్తులను కలిగి ఉండటంతో గత పదేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్లు ఈ షేర్లను కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. గడచిన మూడేళ్లలో ఈ షేరు 25శాతానికి మించి లాభాలను ఇచ్చింది. అన్నింటిని మించి కంపెనీ రుణరహితంగా ఉంది. మే తొలి అర్ధభాగంలో ఈ షేరు 9శాతం నష్టాన్ని చవిచూసింది. లాక్డౌన్ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఉద్యోగాల కోత, తొలిగింపు చేస్తున్న సందర్భంలో తరుణంలో ఈ కంపెనీ తన ఉద్యోగులు శాలరీల పెంచుతున్నట్లు ప్రకటించింది. షేరు పేరు: అరబిందో ఫార్మా మార్కెట్ క్యాప్: రూ.45,249 కోట్లు మ్యూచువల్ ఫండ్: హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ: తక్కువ ఇన్వెంటరీ వ్యయాలు, పెరిగిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లు, ఫార్మూలేషన్ వ్యాపారంలో వృద్ధి, ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే అమెరికా, యూరప్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు కంపెనీ రుణాల తగ్గింపు లాంటి సానుకూలాంశాలు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లను ఆకర్షించాయి. షేరు పేరు: భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్: రూ.305,457 కోట్లు మ్యూచువల్ ఫండ్: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విశ్లేషణ: దేశీయంగా మొబైల్, నాన్-మొబైల్ విభాగంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉండటంతో పాటు ఆఫ్రికాలో వ్యాపారాల డైవర్సిఫికేషన్, ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టడంతో ఈ షేరు మ్యూచువల్ ఫండ్ల దృష్టిని ఆకర్షించింది. వర్క్-ఫ్రమ్ హోమ్ ట్రెండ్ ఏర్పడటం, ఓటీటీ మార్కెట్ పెరగడం కంపెనీకి కలిసొచ్చే ప్రధాన అంశాలు. పోటీలో భాగంగా కస్టమర్లు పెరిగే కొద్ది టెలికాం కంపెనీలు ధరలను పెంచుతూ ఉంటాయి. వచ్చే కొన్నేళ్లలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 10శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైంది: శంకర్ శర్మ
ఈక్విటీ మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైందని మార్కెట్ విశ్లేషకుడు శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం పాటు ఈ స్మాల్‌క్యాప్ షేర్ల హావా కొనసాగుతుందని శర్మ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతానని శర్మ తెలిపారు. తన పోర్ట్‌ఫోలియో మొత్తంలో 67శాతం స్మాల్‌క్యాప్స్, మిడ్ క్యాప్స్ రంగానికి చెందిన షేర్లు ఉన్నాయని తెలిపారు. భారత్‌తో సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లో ఇప్పటికే స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ ప్రారంభమైందని, గడచిన 4-5 ట్రేడింగ్ సెషన్లలో లార్జ్‌క్యాప్స్ షేర్ల ర్యాలీని అధిగమించాయని శర్మ తెలిపారు. ఇలాంటి సంఘటన చూసి చాలా ఏళ్లైందని శర్మ చెప్పారు. ‘‘2017లో స్మాల్‌క్యాప్స్ షేర్లు గొప్ప ర్యాలీని చేశాయి. తరువాత 2018, 2019ల్లో అదే ప్రదర్శన కొనసాగింది. 2007 గరిష్టాల నుంచి ఈ షేర్లు దాదాపు 55-60 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పుడు తిరిగి ర్యాలీని ప్రారంభించాయి. కేవలం భారత్‌లోనే కాక మొత్తం ప్రపంచ మార్కెట్లలో స్మాల్‌క్యాప్ షేర్ల గణనీయమైన ర్యాలీని చూస్తున్నాము.’’ అని శర్మ తెలిపారు. స్మాల్‌క్యాప్ షేర్లలో అత్యధిక అస్థిరత ఉంటుంది. తొందరపడి గుడ్డిగా కొనడం అత్యంత ప్రమాదం. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి భారత్ ఈక్విటీ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్ల ర్యాలీతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. బ్రెజిల్ మార్చి కనిష్ట స్థాయి నుండి 50 శాతం పెరిగిన సంగతి ఈ సందర్భరంగా ఆయన గుర్తు చేశారు. స్టాక్స్ ర్యాలీ ఎల్లప్పుడూ నిజమైన ఆర్థిక వ్యవస్థతో చేతులు కలపవలసిన అవసరం లేదు. చౌకైన డబ్బుతో ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఫండమెంటల్స్ లేకుండానే స్టాక్స్ మార్కెట్లు పెద్ద ర్యాలీని చేస్తాయి. ఈ సూత్రం అర్థిక అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మార్కెట్లతో పాటు అన్ని మార్కెట్లకు కూడా వర్తిస్తుందని శర్మ తెలిపారు. బీఎస్ఈ గణాంకాలను పరిశీలిస్తే వారంలో రోజుల్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4శాతం లాభపడింది. ఇదే ఇండెక్స్ గడచిన నెలరోజుల్లో 12శాతం ర్యాలీ చేసింది. -
అన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం
ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్ క్యాప్ ఇలా అన్ని రకాల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్ కోసం పరిశీలించొచ్చు. పనితీరు.. ఈ పథకం గడిచిన ఏడాది కాల పనితీరు ప్రామాణిక సూచీ కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ పథకం నికరంగా నష్టాలనే ఇచ్చింది. మైనస్ 4.62శాతంగా ఉన్నాయి. 2018లో మార్కెట్ల పనితీరు నిరాశాజనకంగా ఉన్న విషయం గమనార్హం. కానీ, ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావించే బీఎస్ఈ 500 రాబడులు కూడా మైనస్ 7.12 శాతంగా ఉండటం గమనార్హం. మూడేళ్ల కాలంలో అయితే, ఈ పథకంలో రాబడులు 13.27 శాతంగా ఉంటే, బీఎస్ఈ 500 రాబడులు 14.42 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో బీఎస్ఈ 500 రాబడులు 14.51 శాతం, పదేళ్ల కాలంలో 17.13 శాతంగా ఉండగా, ఈకాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ 16.51 శాతం, 18.45 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. దీర్ఘకాలంలో బీఎస్ఈ 500కు మించి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే స్వల్ప కాలం కోసం కాకుండా ఐదేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. పెట్టుబడుల తీరు ఈ పథకం తన పెట్టుబడుల్లో దాదాపు 95 శాతం నుంచి 100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2015, 2016 సంవత్సరాల్లో బెంచ్ మార్క్‌లను మించి రాబడులను ఇవ్వగా, 2017లో మాత్రం వెనుకబడింది. సాఫ్ట్వేర్, హెల్త్‌కేర్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులే ఇందుకు కారణం. ఆ ఏడాదిలో ఈ రెండు రంగాల స్టాక్స్ ర్యాలీ చేయలేదు. 2018 జనవరి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడం, ఈ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఈ పథకం ఎన్ఏవీ రికవరీ అయింది. బ్యాంకులు, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వీటిల్లో సుమారు 34 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఇంధన రంగ స్టాక్స్‌లో సుమారు 19 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలకు సుమారు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించడాన్ని గమనించొచ్చు. అతుల్ పటేల్, శంకరన్ నరేన్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పరంగా అధిక నాణ్యత, వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈక్విటీల్లో భారీ రిస్క్ వద్దనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. -
దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం!
దేశీ స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సూచీలు ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వడ్డీ రేట్లు చూస్తే ఇవి మరికొన్నాళ్లు తక్కువ స్థాయిల్లోనే కొనసాగవచ్చు. వేల్యుయేషన్స్ ధోరణులను, మార్కెట్ల దిశను అంచనా వేయడానికి కీలకమైన ఈ రెండింటి తీరు తెన్నులను బట్టి చూస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈక్విటీలు ఆశావహంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గణనీయంగా పెరిగినప్పటికీ.. వేల్యుయేషన్ దృష్టికోణం నుంచి దీర్ఘకాలిక సగటు ప్రాతిపదికన చూస్తే సూచీల్లోని లార్జ్ క్యాప్ స్టాక్స్ మరీ ఖరీదైనవిగా ఏమీ లేవు. వడ్డీరేట్లు మరి కొంత కాలం తక్కువ స్థాయిలోనే ఉండనున్న నేపథ్యంలో సహేతుకమైన వేల్యుయేషన్స్ గల లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్ చోటు చేసుకోవచ్చు గానీ.. స్థూలంగా చూస్తే మాత్రం రిస్కుకు తగిన రివార్డులివ్వడంలో ఈక్విటీలే ఆశావహంగా కనిపిస్తున్నాయి. స్మాల్ క్యాప్ జోరు తగ్గుముఖం.. దేశీయంగా పెట్టుబడులు ఈక్విటీల్లోకి రావాలంటే మార్కెట్లు బాగుండాలి. స్టాక్‌మార్కెట్లలోకి దేశీ పెట్టుబడులు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ గడిచిన కొన్నాళ్లుగా చూస్తే.. ఈ పెట్టుబడుల్లో అధిక భాగం మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లోకి వచ్చాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోకి అంతగా రాలేదు. లార్జ్ క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు రాణిస్తుంటేనే మార్కెట్లపై దేశీయంగా సామాన్య ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉంటారు. మధ్య, చిన్న స్థాయి షేర్ల వేల్యుయేషన్లు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. దీంతో మరికొన్నాళ్ల పాటు ఈ పరుగు పునరావృతం కాకపోవచ్చు. రేప్పొద్దున మరింత భారీగా ఎదిగే సత్తా ఉన్న చిన్న సంస్థలను నిరంతరాయంగా దొరకపుచ్చుకోవడం చాలా కష్టమైన వ్యవహారమే. మంచి ట్రాక్ రికార్డు, లాభదాయకత, ఉత్తమమైన కార్పొరేట్ విధానాలు, వ్యాపారం తీరుతెన్నులు బాగున్న సంస్థలు స్వల్పకాలంలో లార్జ్ క్యాప్‌లుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఈ రంగాలు ఆసక్తికరం.. రాబోయే రోజుల్లో రంగాలవారీగా చూస్తే.. ఫార్మా మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. ఎఫ్‌డీఏ అంశాలు ప్రస్తుతం చికాకుపెడుతున్నప్పటికీ.. అవి మరింత కాలం కొనసాగకపోవచ్చు. ఫార్మా కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ.. మెల్లగా అంతా చక్కబడగలదు. ఫైనాన్షియల్ సర్వీసుల రంగం కూడా కొన్నాళ్లుగా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తోంది. అలాగే ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలు సైతం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు చిన్న రంగాలకు సంబంధించి టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆగ్రో కమోడిటీ స్టాక్స్ కూడా రాబోయే రోజుల్లో మెరుగ్గా రాణించవచ్చు. విస్తృతమైన ర్యాలీ... వర్ధమాన మార్కెట్లలోకి మళ్లీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో సూచీలు ర్యాలీ చేస్తున్నాయి. క్రమంగా కొన్ని రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం పరిమితమైనా.. మొత్తం మీద మాత్రం విçస్తృ తంగా అన్ని రంగాల షేర్లలోనూ ర్యాలీ కనిపించవచ్చు. అంతర్జాతీయ పరిణామాలకు తగినట్లుగా ఒకో సందర్భంలో ఒక్కో రంగం హైలైట్ కావొచ్చు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో ఉండటంతో పాటు మెరుగైన ఆర్థిక ఫలితాలతో అన్నింటి వేల్యుయేషన్స్ పెరగొచ్చు. వాటికుండే వెయిటేజీని బట్టి తదనుగుణంగా సూచీలు సైతం పెరిగే అవకాశముంది.