సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్! | Six lakh hits per second lead to 'Freedom 251' website crash | Sakshi
Sakshi News home page

సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!

Published Thu, Feb 18 2016 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!

సెకనుకు 6 లక్షల హిట్లు.. సైట్ క్రాష్!

ఫ్రీగా వస్తోందంటే చాలు.. దేనికైనా వెంటపడతారు. వేల రూపాయల విలువైన వస్తువు వందల్లోనే వస్తోందన్నా అంతే. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అయ్యింది. దాదాపు రూ. 3-4 వేల ఖరీదుచేసే స్మార్ట్‌ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామని చెప్పేసరికి జనం ఒక్కసారిగా ఆ సైట్ మీద పడ్డారు. ఒక్క సెకనులోనే 6 లక్షల హిట్లు రావడంతో దెబ్బకి ఫ్రీడమ్251 వెబ్‌సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పడంతో, ఒక్కసారిగా నెటిజన్లు ఆ సైట్ మీద పడ్డారు. దాంతో తమ సైట్ క్రాష్ అయ్యిందని రింగింగ్ బెల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అద్భుతమైన స్పందన కనబర్చినందుకు థాంక్స్ అని, అయితే ఇంత భారాన్ని తట్టుకోలేక తమ సెర్వర్లు మూలపడ్డాయని ఆ సంస్థ తెలిపింది. తమ సెర్వర్ అప్‌గ్రేడ్ చేసుకుని, 24 గంటల్లో మళ్లీ వస్తామని చెప్పింది.

4 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామనడంపై పలు వర్గాల నుంచి సందేహాలు వెల్లువెత్తాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని కంపెనీ తొలుత ప్రకటించింది. జూన్ 30వ తేదీ నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామని అంటూ.. డెలివరీ చార్జీల కింద మరో రూ. 40 కూడా వసూలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement