స్నాప్‌డీల్‌ అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ ప్రారంభం | Snapdeal Unbox Diwali Sale Offers started | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌ అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ ప్రారంభం

Published Fri, Oct 13 2017 1:19 PM | Last Updated on Fri, Oct 13 2017 1:26 PM

Snapdeal Unbox Diwali Sale Offers started

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల కంటే ముందస్తుగానే స్నాప్‌డీల్‌ తన సేల్‌ను ప్రారంభించేసింది. ఈ పండుగ సీజన్‌ క్యాష్‌ చేసుకునేందుకు అన్‌బాక్స్‌ దివాలి సేల్‌ను నేటి నుంచి నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్స్‌పై బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది. పలు బ్యాంకు కార్డులపై కూడా ఫ్లాట్‌ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను స్నాప్‌డీల్‌ ప్రవేశపెట్టింది. వీటితో పాటు ఈ సేల్‌లో భాగంగా ధమాకా డీల్స్‌ను కూడా స్నాప్‌డీల్‌ ఆఫర్‌ చేస్తోంది.


క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు..
ఇతర ఫెస్టివల్‌ సేల్స్‌ మాదిరిగా కాకుండా.. స్నాప్‌డీల్‌ పలు బ్యాంకులపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్‌ కార్డును వాడి కనీసం రూ.2000 మేర కొనుగోలు చేస్తే, 15 శాతం క్యాష్‌బ్యాక్‌ నుంచి రూ.2000 వరకు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తొలిరోజు సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు దారులకు అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రెండో రోజు(శనివారం) స్టాండర్డ్‌ ఛార్టడ్‌ కార్డు యూజర్లకు ఆఫర్లను స్నాప్‌డీల్‌ ప్రకటించింది. 

మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్‌...
వివో వీ5 ప్లస్‌ 64జీబీ గోల్డ్‌ కలర్‌ వేరియంట్‌పై 28 శాతం డిస్కౌంట్‌, ఒకవేళ ఏదైనా బ్యాంకు కార్డు ఆఫర్‌ ఉంటే మరో రూ.2000 క్యాష్‌బ్యాక్‌(మొత్తంగా రూ.17,549కు అందుబాటు)
వివో వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.15,799కు, జియోని ఏ1 రూ.15,348కి, మోటో ఎం రూ.14,999కు, మోటో జీ5ఎస్‌ రూ.14,295కు అందుబాటు
సోనీ ఎండీఆర్‌-జెడ్‌ఎక్స్‌110ఏ హెడ్‌ఫోన్లపై 53 శాతం డిస్కౌంట్‌
లెనోవో ఐడియాప్యాడ్‌ 80ఎక్స్‌హెచ్‌01జీఈఐఎన్‌ నోట్‌బుక్‌పై 21 శాతం డిస్కౌంట్‌, రూ.24,999కే విక్రయం
హెచ్‌పీ 15-బీయూ003టీయూ ల్యాప్‌టాప్‌పై 18 శాతం డిస్కౌంట్‌, రూ.26,499కే అందుబాటు
పలు పీసీ, ల్యాప్‌టాప్‌ మోడల్స్‌ ఈ సేల్‌లో డిస్కౌంట్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement