రుణ రేట్ల తగ్గింపు వరుసలో మరికొన్ని బ్యాంకులు! | Some banks in debt lending reduction | Sakshi
Sakshi News home page

రుణ రేట్ల తగ్గింపు వరుసలో మరికొన్ని బ్యాంకులు!

Published Sat, Sep 2 2017 1:15 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

రుణ రేట్ల తగ్గింపు వరుసలో మరికొన్ని బ్యాంకులు!

రుణ రేట్ల తగ్గింపు వరుసలో మరికొన్ని బ్యాంకులు!

ముంబై: కొత్త నెల ఆరంభం అయిన నేపథ్యంలో– తమ నిధుల లభ్యత వ్యయం ప్రాతిపదికన పలు బ్యాంకులు మార్జినల్‌ కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) తగ్గిస్తున్నాయి. యూనియన్‌ బ్యాంక్, దేనాబ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించాయి. వేర్వేరుగా చూస్తే...

యూనియన్‌ బ్యాంక్‌: యూనియన్‌ బ్యాంక్‌ అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. గురువారం నుంచే తాజా రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఏడాది కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ 8.40 నుంచి 8.20%కి చేరింది. ఆరు నెలల రేటు 8.05%కి తగ్గింది. రెండు, మూడేళ్ల కాలపరిమితి విషయంలో ఈ రేటు వరుసగా 8.25 %, 8.30%కి చేరింది.  

దేనాబ్యాంక్‌: ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ 15 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. ఏడాది కాలానికి రేటు 8.55% నుంచి 8.40%కి చేరింది. ఓవర్‌నైట్, నెల కాలపరిమితులకు రేటు 8.20%కి తగ్గించింది. మూడు నెలల కాలానికి రేటు 8.30%గా ఉంది.  

ఇండియన్‌ బ్యాంక్‌ నాన్‌–రెసిడెంట్‌ డిపాజిట్‌ రేటు కోత...
ఫారిన్‌ కరెన్సీ నాన్‌–రెసిడెంట్‌ బ్యాంకింగ్‌ డిపాజిట్లపై రేటును తక్షణం అమల్లోకి వచ్చేట్లు ఇండియన్‌ బ్యాంక్‌ తగ్గించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లకు సంబంధించి ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వడ్డీరేటును డాలర్‌ టర్మ్స్‌లో  2.44%గా నిర్ణయించింది. ఏడాది–మూడేళ్ల మధ్య రేటును 2.60% నుంచి 2.56%కి తగ్గించింది. మూడేళ్లు–నాలుగేళ్ల మధ్య రేటు 2.75% నుంచి 2.67%కి తగ్గింది. నాలుగు–ఐదేళ్ల మధ్య రేటు 2.86% నుంచి 2.75%కి చేరింది. ఐదేళ్లపైన రేటు 2.96% నుంచి 2.84%కి తగ్గింది.  

పొదుపు ఖాతా రేటు తగ్గించిన కెనరా బ్యాంక్‌  
కెనరాబ్యాంక్‌ రూ.50 లక్షల వరకూ డిపాజిట్‌కు సంబంధించి పొదుపు ఖాతాలపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితోరేటు 3.5 శాతానికి తగ్గుతుంది. రూ.50 లక్షల పైబడిన మొత్తం విషయంతో ఈ రేటు 4%గానే కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement