గోల్డ్ బాండ్ స్కీమ్...మళ్లీ ఈ నెల 24 నుంచి | Sovereign Gold Bond 6th Tranche this month 24th | Sakshi
Sakshi News home page

గోల్డ్ బాండ్ స్కీమ్...మళ్లీ ఈ నెల 24 నుంచి

Published Fri, Oct 21 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

గోల్డ్ బాండ్ స్కీమ్...మళ్లీ ఈ నెల 24 నుంచి

గోల్డ్ బాండ్ స్కీమ్...మళ్లీ ఈ నెల 24 నుంచి

వచ్చే నెల 17న ముగింపు 2.5 శాతం వార్షిక వడ్డీ

న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ) స్కీమ్ ఆరవ అంచె ఈ నెల 24న ప్రారంభం కానున్నది. దీపావళి పండుగకు ముందు ప్రభుత్వం ఈ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)తో కలసి భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సావరిన్ గోల్డ్ బాండ్స్, సిరీస్ త్రీని జారీ చేయనున్నది. ఈ నెల 24న ప్రారంభమయ్యే ఈస్కీమ్ వచ్చే నెల 17 వరకూ అందుబాటులో ఉంటుంది.

భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా సావరిన్ గోల్డ్‌బాండ్స్ స్కీమ్‌ను కేంద్రం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను ఇప్పటికే ఐదుసార్లు అందుబాటులోకి తెచ్చింది. ఐదవసారి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకూ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు రూ.3,060 కోట్లకు చేరాయని ఆర్‌బీఐ ఇటీవలనే తెలిపింది.

 ఈ బాండ్లను బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్స్చేంజీలు విక్రయిస్తాయి. ఈ గోల్డ్ బాండ్ల పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 2.5 శాతం వడ్డీని ప్రతి ఆరు నెలలకొకసారి పొందుతారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్లు దాటిన తర్వాత ఈ స్కీమ్ నుంచి వైదొలగవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల వరకూ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ గోల్డ్ బాండ్ల ద్వారా రుణాలు కూడా పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల రిడంప్షన్‌పై మూలధన లాభాల పన్ను మినహాయింపును పొందవచ్చు. ఆర్‌బీఐ నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ గోల్డ్ బాండ్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement