మరిన్ని చౌక విమానయాన ఆఫర్లు | SpiceJet, Indigo, GoAir roll out another sale offer starting Rs 1,699 | Sakshi
Sakshi News home page

మరిన్ని చౌక విమానయాన ఆఫర్లు

Published Wed, Jul 16 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

మరిన్ని చౌక విమానయాన ఆఫర్లు

మరిన్ని చౌక విమానయాన ఆఫర్లు

ముంబై: దేశీయ చౌక విమానయాన సంస్థలు చౌక ధరలకే విమానయానాన్నందించే ఆఫర్లను మంగళవారం ప్రకటించాయి. స్పైస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్ కంపెనీలు రూ.1,699 నుంచి ప్రారంభమయ్యే ధరలకే దేశీయ రూట్లలో విమాన టికెట్లను అందిస్తున్నాయి. ఈ సంస్థలందించే ఆఫర్లకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి, మరో రెండు రోజులే అందుబాటులో ఉంటాయి.

 వచ్చే నెల 18 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి.  ఇండిగో చార్జీలు రూ.1,699 నుంచి, స్పైస్‌జెట్ చార్జీలు రూ.1,999 నుంచి ప్రారంభమవుతాయి. స్పైస్‌జెట్ సంస్థ అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తోందని రాజేష్ చెప్పారు. బగ్‌డోగ్ర, కోల్‌కతల నుంచి ఖఠ్మాండుకు మొదటి వెయ్యి సీట్లను చౌక ధరలకే అందించనున్నదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement