స్పైస్ జెట్ దీపావళి ధమాకా ఆఫర్ | Spicejet offers over 3 lakh seats at low fares | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ దీపావళి ధమాకా ఆఫర్

Published Tue, Oct 27 2015 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

స్పైస్ జెట్ దీపావళి ధమాకా ఆఫర్

స్పైస్ జెట్ దీపావళి ధమాకా ఆఫర్

దీపావళి సీజన్ దగ్గర పడటంతో.. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. చవక ధరలకు 3 లక్షల టికెట్లను అమ్మకానికి పెట్టింది. స్వదేశీ ప్రయాణాలకు అయితే రూ. 749 నుంచి (పన్నులు కాకుండా), విదేశాలకు అయితే రూ. 3,999 నుంచి టికెట్ల ధరలున్నాయి. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్. ముందుగా వచ్చినవాళ్లకే టికెట్లు ఉంటాయని చెప్పారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి తొమ్మిది నెలల్లోగా ఈ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

దీనికి అన్ని వర్గాల ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేవారికి ఇది చాలా సౌఖ్యంగా ఉంటుందని అన్నారు. మంగళవారం నుంచి అక్టోబర్ 29 వరకు ఈ చవక టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ కింద ఢిల్లీ నుంచి అమృతసర్, అహ్మదాబాద్, ముంబై నగరాలకు వెళ్లేందుకు రూ. 749 బేస్ ఫేర్‌తో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement