స్పైస్‌జెట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ | SpiceJet rolls out another discount offer, mainly for the South this time | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్

Published Wed, Apr 9 2014 1:19 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

స్పైస్‌జెట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ - Sakshi

స్పైస్‌జెట్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రిల నుంచి దేశంలోని వివిధ నగరాలకు డిస్కౌంట్ ధరలకే విమానయానాన్ని స్పైస్‌జెట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా తమిళనాడులోని చెన్నై, మధురై, ట్యుటికోరిన్, కోయంబత్తూర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాల నుంచి కూడా దేశంలోని వివిధ నగరాలకు డిస్కౌంట్ ధరలకే విమాన టికెట్లను అందిస్తున్నామని స్పైస్‌జెట్ కంపెనీ తెలిపింది. ఈ నెల 8 నుంచి 10 వరకూ జరిగే బుకింగ్‌లకు మాత్రమే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని, ఈ ఆఫర్ టికెట్ల ప్రయాణాలు  జూన్ 1 నుంచి జూలై 1 మధ్య ఉండాలని పేర్కొంది.

హైదరాబాద్ నుంచి రూ.1,773కు, విజయవాడ, రాజమండ్రి, మధురై, ట్యుటికోరిన్‌ల నుంచి రూ.1,806కు, తిరుపతి, కోయంబత్తూర్‌ల నుంచి రూ.1,859కు, చెన్నై నుంచి రూ.1,907కు, వైజాగ్ నుంచి రూ.2,009కు, కోల్‌కతా నుంచి రూ.2,123 ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తున్నామని వివరించింది. అన్ని చార్జీలను కలుపుకొని ఈ ధరలను ఆఫర్ చేస్తున్నామని, సీట్లు పరిమితమని, మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. డెరైక్ట్, కనెక్టింగ్ ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement